Begin typing your search above and press return to search.

దుష్యంత్ తో జత కట్టాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారట

By:  Tupaki Desk   |   26 Oct 2019 6:08 AM GMT
దుష్యంత్ తో జత కట్టాలని ఎప్పుడో డిసైడ్ అయ్యారట
X
మహారాష్ట్ర.. హర్యానా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావటం.. ఓటర్ల తీర్పు ఆసక్తికరంగా మారటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ వర్గాలు చేస్తున్న ప్రకటనలు ప్రజల్ని అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు పక్కా అని... మరో మాటకు అవకాశం లేదంటూ ఒకట్రెండు మీడియా సంస్థలు మినహాయించి మిగిలిన అన్ని మీడియా సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ తమ రిపోర్టుల్ని వెల్లడించటం తెలిసిందే.

ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా హర్యానాలో బీజేపీ ఓటమి బాట పట్టటం తెలిసిందే. తాజాగా జననాయక జనతా పార్టీ షార్ట్ కట్ లో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ డిసైడ్ కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు నేపథ్యంలో బీజేపీ వర్గాలు దిమ్మ తిరిగిపోయేలా ఒక ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

అదేమంటే.. హర్యానాలో తమ పార్టీ ఓడుతుందన్న విషయాన్ని పోలింగ్ జరిగిన వెంటనే పసిగట్టామని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఫలితాలు ఉండవన్న విషయాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే.. ఫలితాలు రాక ముందే తాము జేజేపీతో భేటీ అయి.. ప్రభుత్వ ఏర్పాటు గురించి గతంలోనే మాట్లాడినట్లు చెబుతున్నారు.

ఒకవేళ అదే నిజమనుకుంటే.. మరీ విషయాన్ని మీడియాలో ఎందుకు చెప్పనట్లు? అన్నది క్వశ్చన్. ఎగ్జిట్ పోల్స్ ను ఉదాహరణగా చూపిస్తూ తమకు తిరుగులేదన్నట్లుగా చెప్పుకున్న బీజేపీ.. తాజాగా చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే.. మోడీషా మార్క్ రాజకీయం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.