Begin typing your search above and press return to search.
బీజేపీ ఇప్పుడు కూడా సత్తా చాటకుంటే.. దుకాణం మూసేయడమేనా?
By: Tupaki Desk | 28 Oct 2021 4:30 PM GMTఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని.. పదే పదే చెబుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. ఇప్పటి వరకు జరిగిన స్థానిక, పంచాయతీ, పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడ్డారు. ఇక, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ నోటాను దాటలేక పోయారు. అయినప్పటికీ..`పులుపు చావలేదు..` అన్నట్టు గా.. ఇప్పుడు కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలోనూ బీజేపీ పోటీకి దిగింది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేది లేదన్న ట్యాగ్ లైన్‌తో ఇక్కడ బరిలో నిలబడింది. అంతేకాదు.. సర్వశక్తులూ ఒడ్డింది. శుక్రవారం ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు జరగనున్న పోలింగ్.. బీజేపీకి చావోరేవో తేలిపోతుందని అంటున్నారు.
దీనికి ప్రదాన కారణం..బీజేపీ ఇప్పటి వరకు చేయని ప్రచారం.. ఇప్పటి వరకు.. రాష్ట్ర చరిత్రలో అందని.,. సహకారం ఇక్కడ అందుతున్నాయి. బద్వేల్ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే.. ఈ ఉప ఎన్నికలో రెండు ప్రధాన పార్టీలు.. టీడీపీ, జనసేనలు పోటీ నుంచి దూరంగా ఉంటున్నాయి. కానీ.. అదేసమయంలో పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నాయి. మొదట టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ టికెట్‌ను గత ఎన్నికల్లో ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్‌కే కేటాయించారు. కానీ, నోటిఫికేషన్ వచ్చాక విరమించుకున్నారు.
ఈ మధ్యలోనే బీజేపీతో ఏదో కుదిరిందని.. ముఖ్యంగా ఓ పార్టీ నాయకుడి సూచనలతో చంద్రబాబు వెనక్కి తగ్గారని హైదరాబాద్‌లో గుసగుస వినిపించింది. సో.. ఇక, టీడీపీ ఓట్లు ప్రత్యక్షంగా లేక.. పరోక్షంగా బీజేపీకే పడతాయనే ఒక అంచనా వుంది. అయితే.. బీజేపీకి ఇక్క ఈ ఒక్కటే కాదు.. మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ వంటి కీలక నేతలు కూడా బీజేపీకి ప్రచారం చేశారు. వీరిద్దరూ కడపలో కీలక నాయకులుగా ఉన్నారు. గతంలో కడప ఉక్కుకోసం నిరాహారదీక్ష చేసిన రమేష్‌కు మంచి ఫాలోయింది ఉంది.
కడప జిల్లాలో బీజేపీ తరఫున అత్యంత కీలక నాయకులుగా వీరిద్దరే చలామణి అవుతున్నారు. పైగా కేంద్రంలోనూ దుమ్ము దులపాలని భావిస్తున్నారు. సో.. ఇప్పుడు వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుం టారనే చర్చ సాగుతోంది. మరోవైపు.. బీజేపీ దళం మొత్తం.. బద్వేల్‌లోనే పాగా వేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి.. ఇలా అనేక మంది నాయకులు వచ్చారు. వీరికితోడు కేంద్రంలోని మంత్రులు.. కూడా ఇక్కడ క్యూకట్టారు.
ఇక, తెలంగాణకు చెందిన యువ నాయకుడు హర్షవర్ధన్‌రెడ్డి వచ్చి.. ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలు చేశారు. సో.. ఇలా.. ఒక్క ఉప ఎన్నిక కోసం.. బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. దీనిని బట్టి.. బీజేపీ గెలుపు సాధ్యమనే అంచనాలు వేసుకుంటున్నారు ఏపీ కమల నాథులు. అయితే. వైసీపీ నాయకులు మాత్రం సెంటిమెంటు ప్రధానంగా జరుగుతున్న ఇలాంటి ఎన్నికలో తమదే గెలుపని.. 100000 ఓట్ల మెజారిటీ ఖాయమని చెబుతున్నారు. సో.. ఇప్పుడైనా.. బీజేపీ పట్టు పెంచుకుంటే తప్ప.. కనీసం.. గౌరవప్రదమైన ఓట్లు సాధిస్తే.. తప్ప ప్రయోజనం లేదని.. లేక పోతే.. చాపచుట్టేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో.. చూడాలి.