Begin typing your search above and press return to search.
అక్కడ కాంగ్రెస్ ను కకావికలం చేస్తున్న బీజేపీ!
By: Tupaki Desk | 9 Jun 2019 5:10 AM GMTదేశంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పేలా లేవు. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేయడమే పనిగా పెట్టుకుని బీజేపీ రెచ్చిపోయేలా ఉంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించిన బీజేపీ ఇక రాష్ట్రాల వారీగా అనేక మార్గాల్లో కాంగ్రెస్ ను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఉంది.
అందులో భాగంగా మహారాష్ట్ర లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టిందట. అక్కడ ఇప్పుడు ఉన్నది బీజేపీ సర్కారే. శివసేన-బీజేపీలు జాయింటుగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాయక్కడ. త్వరలోనే ఆ రాష్ట్రంలో ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి.
అయినా కూడా బీజేపీ అవకాశాన్ని వదులుకోనట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షం నుంచి ఏకంగా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తమ పక్షంలోకి రావడానికి రెడీగా ఉన్నారని బీజేపీ ప్రకటించింది. వారంతా బేషరతుగా వస్తామని తమకు చెబుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ నుంచి - ఎన్సీపీ నుంచి మొత్తం పాతిక మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడానికి రెడీగా ఉన్నారని కమలం పార్టీ అంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో అంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ - ఎన్సీపీలను వీడి బీజేపీలోకి చేరితే.. ఆ పార్టీలకు అది పెద్ద దెబ్బే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.