Begin typing your search above and press return to search.
బీజేపీ మిత్రులను దూరం చేసుకుంటోందా?
By: Tupaki Desk | 12 Aug 2019 8:45 AM GMTసరిగ్గా నాలుగు వోట్లు వేయించలేని వారిని నమ్ముకుని - దుబారా మాటలతో - అత్యుత్సాహంతో భారతీయ జనతా పార్టీ నమ్మకమైన వ్యక్తులను దూరం చేసుకుంటోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏపీ - తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీరు గమనించాకా పరిశీలకులు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.
ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారు. అలాగే ప్రజల్లో ఏ మాత్రం పలుకుబడి లేని వాళ్లు - కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా నెగ్గేంత సీన్ కూడా లేకున్నా.. అడ్డగోలుగా మాట్లాడే వాళ్లు అంతా బీజేపీ లోకి చేరి హడావుడి చేస్తూ ఉన్నారు.
ఇలాంటి వారు తమ మాటలతో అటు ప్రజల్లో పార్టీ పై వ్యతిరేకతను పెంచడంతో పాటు.. ఏపీ - తెలంగాణ ముఖ్యమంత్రులతో కూడా బీజేపీకి దూరం పెంచుతూ ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కేసీఆర్ - జగన్ లను అనవసరంగా దూరం చేసుకుంటున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
లోక్ సభలో బీజేపీకి వేరే పార్టీలతో అవసరం లేకపోవచ్చు. అయితే రాజ్యసభలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇంకా మిత్రపక్షాల అవసరం ఎంతైనా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ - ఏపీల్లో మొత్తం రాజ్యసభ సీట్లన్నీ టీఆర్ ఎస్ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకే వెళతాయి.
కేసీఆర్ - జగన్ చేతుల్లో దాదాపు 18 మంది రాజ్యసభ సభ్యులుంటారు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి ఫిరాయించిన వారి పదవీ కాలాలు కూడా కొన్ని నెలల్లో ముగియబోతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పరిస్థితులను భారతీయ జనతా పార్టీ గుర్తు ఎరిగి వ్యవహరిస్తే మంచిదని - తమతో దోస్తీ చేసే వారిని జగన్ – కేసీఆర్ లు ముంచే టైపు కాదు - చంద్రబాబు టైపు కాదు అనే విషయాన్ని గ్రహించి వ్యవహరించుకోవాలని పరిశీలకులు బీజేపీకి సూచిస్తున్నారు.