Begin typing your search above and press return to search.
సోషల్ ప్రచారంలో బీజేపీ దూకుడు..
By: Tupaki Desk | 8 April 2019 8:43 AM GMTదేశంలో సార్వత్రిక ఎన్నికల టైం.. ప్రతీ అవకాశాన్నివినియోగించుకోవాలి.. ప్రతీ ఓటరుకు రీచ్ కావాలి.. అది ప్రత్యక్షంగా కానీ.. లేదా పరోక్షంగా కానీ అందరిని టచ్ చేయాలి.. అదెప్పుడు సాధ్యం కాదు.. కానీ 120 కోట్ల మంది భారతీయుల్లో 90 కోట్ల మంది చేతుల్లో సెల్ ఫోన్ లున్నాయి. ఇందులో మెజార్టీ ప్రజలు సోషల్ మీడియాను విరివిగా వాడుతున్నారు. ఫేస్ బుక్ ను వాడని వారు ఉండరు.. అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారానికి దేశంలోని ప్రధాన పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి..
తాజాగా ఫేస్ బుక్ యాడ్ లైబ్రరీ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య దేశంలో రాజకీయ పార్టీలు - వాటి మద్దతు దారులు కలిసి సోషల్ మీడియాలో చేసిన ప్రచారం ఖర్చు అక్షరాల రూ.10.32కోట్లు అని తెలిపింది. ఇందులో అత్యధికంగా బీజేపీనే ఖర్చు చేయడం విశేషం. మార్చి 23వరకు ఫేస్ బుక్ లో ప్రకటనల సంఖ్య 41974గా సంస్థ తెలిపింది. ఇందులో బీజేపీ.. భారత్ కి మన్ కీబాత్ కే 3700 ప్రకటనలకు రూ.2.23కోట్లు ఖర్చు చేసినట్టు లెక్క చూపారు.మై ఫస్ట్ ఓట్ ఫర్ మోడీ - నేషన్ విత్ నమో లాంటి ఫేస్ బుక్ పేజీల పైనా బీజేపీ భారీగా ఖర్చు చేసింది..
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం సోషల్ ప్రచారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. కాంగ్రెస్ ఈ రెండు నెలల్లో కేవలం 410 ప్రకటనలు మాత్రమే ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం కేవలం రూ.5.91 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. ఇక కాంగ్రెస్ కంటే కూడా ఒడిషాకు చెందిన బిజూ జనతాదళ్ రూ.8.56లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టింది. టీడీపీ రూ.1.58 లక్షలు - ఎన్సీపీ రూ.58వేల ఖర్చు చేసినట్టు ఫేస్ బుక్ తెలిపింది.
ఇలా దేశంలో సోషల్ మీడియాను తెగ వాడేస్తూ కోట్లు ఖర్చు చేస్తున్న మొదటి పార్టీగా బీజేపీ నిలిచింది. దీనికి అసలు దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ లేకపోవడం గమనార్హం.