Begin typing your search above and press return to search.
హైదరాబాదీలపై బీజేపీ వరాల జల్లు..రూ. 25 వేల సాయం - చలాన్లు కట్టేస్తాం!
By: Tupaki Desk | 19 Nov 2020 5:31 PM GMTజీహెచ్ ఎంసీ ఎన్నికలకి కౌంట్ డౌన్ మొదలు కావడంతో అన్ని పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ తరుణంలో అధికార టిఆర్ ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని , ప్రపంచంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన ప్రధాని మోదీపై విమర్శలు చేయడం సరికాదు అని అన్నారు. కేసీఆర్ అంత దుర్మార్గపు సీఎం దేశంలో ఎక్కడా లేడని , రాష్ట్ర ప్రజలు ఆయనను చూసి సిగ్గు పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు బార్లు, వైన్సే మిగులుతాయని తీవ్రస్థాయితో ధ్వజమెత్తారు.
అలాగే నగర వాసులపై వరాల జల్లు కురిపించారు. బీజేపీకి మేయర్ పీఠం దక్కితే.. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.25 వేల చొప్పున సాయం అందజేస్తామని ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఏ ఇంటికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి, కేంద్రం నుంచి నిధులు రప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు కూలిపోతే ఇళ్లు కట్టిస్తాం. బైక్‌లు పోతే బైక్‌లు కొనిస్తాం.. కార్లు పోతే కార్లు కొనిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు రూ.10 వేలు ఇచ్చే యోచన ఉంటే నేరుగా ఇవ్వొచ్చు కదా అని సంజయ్ సూచించారు.బీజేపీ వరద సాయాన్ని ఆపిందంటూ టీఆర్‌ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని బండి సంజయ్ అన్నారు. తన సంతకం ఫోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపించారు. వరద సాయం ఆపాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరలేదని, అది కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు.
చలాన్ల పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బైక్ మీద ముగ్గురు యువకులు వెళ్తే చలాన్లు విధిస్తున్నారు. బీజేపీ జీహెచ్ ఎం సీ మేయర్ పదవిని చేపట్టిన తర్వాత.. భాగ్యనగర పరిధిలో వసూలు చేసిన చలాన్లను మొత్తం మేమే కడతాం. చలాన్ల కారణంగా ఎక్కువగా యువకులే ఇబ్బంది పడుతున్నారు. ఓల్డ్ సిటీలో ఎన్ని చలాన్లు వసూలు చేస్తున్నారు.. అక్కడి వాళ్లే మనుషులు.. బయటి వాళ్లు కాదా.. అని బండి సంజయ్ ప్రశ్నించారు. జీహెచ్ ఎం సీలో బీజేపీ గెలిస్తే.. ముఖ్యమంత్రి దిగొస్తాడు.. ఎల్‌ఆర్ఎస్‌ను రద్దు చేస్తాడని బండి సంజయ్ అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో జనసేన తో పొత్తు లేదని తెలిపారు.