Begin typing your search above and press return to search.
అతి పెద్ద డిజాస్టర్..... ఒప్పుకుంటారా...?
By: Tupaki Desk | 8 Nov 2021 10:48 AM GMTదేశంలోని ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. వారు మరే దానికి గానీ ఆర్డర్ కానీ బద్ధులు కారు. ఆ సంగతి అందరి కంటే ఎక్కువగా తెలిసింది బీజేపీ నేతలకు మాత్రమే. అందుకే బీజేపీ పీపుల్ తో ఎమోషనల్ కనెక్టివిటీ ద్వారానే ఎన్నో ఎత్తులు ఎదిగింది. ఇక మోడీ మీద జనాలకు ఎంతో గురి. ఈ రోజుకీ ఆయన ప్రసంగం వింటూంటే ఉత్తేజం పొందేవారు చాలా మందే కనిపిస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మోడీ మాస్టార్ ఒక భారీ ప్రయోగం చేశారు. అది 2016 సంవత్సరం. నవంబర్ నెల. 8వ తేదీ. చలి బాగా ముదురుతున్న కాలం. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తాపీగా టీవీల ముందుకు వచ్చిన దేశ ప్రధాని మోడీ అప్పటిదాకా చలామణీలో ఉన్న పెద్ద నోట్లు వేయి, అయిదు వందల రూపాయలు రద్దు అయ్యాయని చల్లని కబురు వినిపించారు.
అంతే ఒక్కసారిగా దేశ ప్రజలలో అలజడి రేగింది. తమ వద్ద ఉన్న నోట్లు ఇక చెల్లవు అనుకున్న వారి గుండెలు ఒక్కసారిగా ఝల్లుమన్నాయి. అయితే ఇదంతా దేశం కోసమే అని మోడీ మాస్టారు చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు వల్ల దేశంలో అవినీతి పోతుందని, కొండలుగా పాతుకుపోయిన నల్లధనం గుట్టలు తెంచుకుని బయటకు వస్తుందని గొప్పగా ప్రకటించారు. అంతే కాదు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిన పెద్ద నట్లను రద్దు చేస్తే దేశంలో టెర్రరిజం ఆగుతుందని కూడా నమ్మబలికారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మూలన చేరిన ధనం, వాడకుండా నేల మాళిగలలో దాచిన సొమ్ము కూడా బయటకు వచ్చి లెక్కలలో తేలుతుందని పేర్కొన్నారు.
దాని వల్ల రూపాయి అసలు విలువ పెరుగుతుందని, దేశంలో ద్రవ్యోల్బనం తగ్గుతుందని, ధరలు కూడా ఒక్కసారిగా నేలకు దిగిపోతాయని ఆశలు పెట్టారు. ఇది జాతి హితం కోసం జరుగుతున్న ఉద్యమం. అందరూ చేయూత ఇవ్వాలని కేంద్ర పెద్దలు నాడు కోరారు. అంతే ఎంతటి బాధను అయినా పంటి బిగువున దాచుకుంటూ దేశమంతా ఓర్చి మరీ పెద్ద నోట్ల రద్దుకు స్వాగతం పలికింది. ఇక పాత నోట్లు మార్చుకోవడం దేశంలో సామాన్యులకు పదుల కోట్ల మందికి బహు కష్టమైంది. వారు చలి కాలంలో రోజుల తరబడి బ్యాంకుల వద్ద వేచి వేచి చూసి అలాగే క్యూ లైన్లలోనే చనిపోయారు. నోట్ల రద్దు ఆందోళనతో ప్రాణాలు అర్పించిన వారూ ఉన్నారు. వృద్ధులు అయితే చెప్పనవసరం లేదు. పెద్ద నోట్ల రద్దు వారి ప్రాణం మీదకే వచ్చిపడింది. ఇలా ఎంత మంది చనిపోయారు అన్న దానికి నంబర్ అయితే కరెక్ట్ గా లేదు కానీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే జరిగింది అన్నది వాస్తవం.
ఇక అదే సమయంలో పెద్ద నోట్లు ఎక్కడ అయితే గుట్టలు గా పడి ఉన్నాయో ఆ కామందులు చాలా ఈజీగా నోట్లు మార్చేసుకున్నారు. వారు ఎండ కన్ను ఎరగలేదు చలి బాధను చూడలేదు, కానీ సామాన్యుడే సమిధ అయ్యాడు. తీరా చూస్తే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అంతా తిరిగి బ్యాంకులకు చేరిపోయింది. మరి పెద్ద నోట్ల రద్దు వల్ల ఒరిగిన ప్రయోజనం ఏంటి అన్నది ఈ రోజుకీ నోబెల్ ప్రైజ్ కొట్టిన ఆర్ధిక శాస్త్రవేత్తలకు అర్ధం కాని బ్రహ్మ పదార్ధంగానే ఉంది. ఒక విధంగా బీజేపీ సర్కార్ చేసిన అతి పెద్ద తప్పిందంగా రాజకీయ పండితులు కూడా ఈ రోజుకీ చెబుతారు. దాని మీద జాతికి క్షమాపణలు చెప్పాలని విపక్షాలు నాటి నుంచి కోరుతూనే ఉన్నాయి. తాజాగా పెద్ద నోట్ల రద్దుకు అయిదేళ్ళు పూర్తి అయిన వేళ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ అయితే మోడీ సర్కార్ ని ఏకి పారేశారు. అతి పెద్ద డిజాస్టర్ మీది అంటూ నిప్పులు చెరిగారు. దీని మీద సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అయితే మీరు పట్టుకున్న నల్లధనం వివరాలు చెప్పండి అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి నవంబర్ 8 అంటే మాత్రం బీజేపీ వారి అతి పెద్ద ఫెయిల్యూర్ డే గా కూడా గుర్తుకు వస్తూనే ఉంటుందేమో.