Begin typing your search above and press return to search.
బీజేపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై...వైసీపీ వైపు చూపు
By: Tupaki Desk | 11 Dec 2016 8:31 AM GMTఆంధ్రప్రదేశ్ లో బలపడటం ద్వారా 2019 ఎన్నికల్లో సొంతంగా సత్తా చాటుకోవాలనుకునే బీజేపీ ఆకాంక్షకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ ఆఫీస్‌కు రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బీజేపీకి భవిష్యత్ లేదని ప్రకటించారు. ఇదిలాఉండగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వెల్లంపల్లి చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతతో మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం.
ప్రజారాజ్యం ద్వారా మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వెల్లంపల్లి అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన అనంతరం అందులోనే కొనసాగారు. అనంతరం బీజేపీలో చేరిన శ్రీనివాస్ పార్టీ పటిష్టం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని గతంలోనే వార్తలు వెలువడ్డాయి. వీటిని నిజం చేస్తూ...తాజాగా బీజేపీకి వెల్లంపల్లి గుడ్ బై చెప్పేశారు. కాగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో ప్రజారాజ్యంలో తమతో కలిసి ఎమ్మెల్యేగా కొనసాగి ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఓ నాయకుడితో మంతనాలు సాగిస్తున్నట్లు వెల్లంపల్లి సన్నిహిత వర్గాలు అంటున్నాయి.