Begin typing your search above and press return to search.
ముంబయ్ పై కన్నేసిన బీజేపీ
By: Tupaki Desk | 6 Sep 2022 4:52 AM GMTతొందరలో జరగబోయే బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)పై బీజేపీ కన్నేసింది. తొందరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి శివసేన థాక్రే వర్గాన్ని గట్టి దెబ్బకొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నది. శివసేనలోని రెండు వర్గాల మధ్య పార్టీ గుర్తుపై తీవ్రస్థాయిలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. శివసేన చీఫ్ ఉద్థవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే కూల్చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ సహకారంతో షిండే పార్టీలో తిరుగుబాటు లేవదీసి తమదే అసలైన శివసేనంటు నానా గోల చేస్తున్నారు. మొత్తానికి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ సహకారంతో షిండే సీఎం అయిపోయారు. షిండే సీఎం అయిపోయారు కానీ ఇంకా శివసేన ఆధిపత్యం ఉద్ధత్ చేతిలోనే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండటం వేరు బీఎంసీలో అధికారం ఉండటం వేరు. 227 సీట్లున్న బీఎంసీలో ప్రస్తుతం ఉద్థవ్ నాయకత్వంలోని శివసేనదే ఆధిపత్యం. ఈ విషయాన్నే అమిత్ షా గుర్తుచేశారు.
బీఎంసీలో గెలవనంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. 227 సీట్లలో బీజేపీ+శివసేన (షిండే)వర్గం కచ్చితంగా 150 సీట్లలో గెలిచి తీరాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. బీఎంసీ ఎన్నికల్లో థాక్రే వర్గాన్ని పూర్తిగా దెబ్బకొడితే కానీ రాష్ట్రంపై సంపూర్ణ ఆధిక్యత వచ్చినట్లు కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో థాక్రేని గట్టిదెబ్బ కొడితే కానీ ఆయన ఆధ్వర్యంలోని శివసేనను తుడిచిపెట్టినట్లు కాదన్నారు.
బీఎంసీ ఎన్నికల్లో గెలవకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని అమిత్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎందుకంటే అమిత్ కు తెలుసు తాము చేసిన కంపు ఏమిటో. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారిలో అధికారాన్ని అందుకున్నంత మాత్రాన బీజేపీకి ప్రజాబలం ఉన్నట్లు కాదు.
అందుకనే మళ్ళీ శివసేన(థాక్రే), కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఎక్కడ విజయం సాధిస్తోందో అని అమిత్ భయపడుతున్నారు. చూద్దాం మున్సిపల్ ఎన్నికల్లో ఏమవుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.