Begin typing your search above and press return to search.
మళ్లీ విదేశాలకు చంద్రబాబు..ఈసారి బీజేపీలో చేరేదెవరెవరో?
By: Tupaki Desk | 27 July 2019 1:30 AM GMTటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత నెలలో విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. ఏకంగా రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసేశారు. అంతేకాదు... పార్టీలోని కాపు ఎమ్మెల్యేలు - ఆ సామాజిక వర్గ సీనియర్ నేతలు రహస్య సమావేశం పెట్టుకుని చంద్రబాబుకు షాకిచ్చేందుకు వ్యూహరచన చేశారు. అయితే, చంద్రబాబు విదేశాల నుంచి రాగానే ఆగమేఘాల మీద వారితో సమావేశమై తాత్కాలికంగా వారిని ఆపగలిగారు.
ఇప్పుడు చంద్రబాబు మరోసారి విదేశాలకు వెళ్తుండడంతో ఆయన తిరిగొచ్చేసరికి పార్టీ ఖాళీ అయిపోతుందేమోనన్న వాదన ఒకటి మొదలైంది. ఈసారి లోక్ సభలోని ముగ్గురు టీడీపీ ఎంపీల్లో ఎవరైనా షాకివ్వొచ్చని.. కాపు ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఇలాంటి తరుణంతో చంద్రబాబు ఈ ఆదివారం అమెరికాకు వెళ్తుండడంతో ఆయన వచ్చేటప్పటికి పార్టీ ఏమవుతుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు ఆగస్టు 1న మళ్లీ ఇండియాకు వస్తున్నారు. అయితే, ఆయన వచ్చేలోగా పార్టీ నుంచి ఫిరాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
గత నెలలో చంద్రబాబు విదేశాలకు వెళ్లినప్పుడు రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుంచి బీజేపీ కూడా టీడీపీ నేతలను లాక్కునేందుకు అవకాశం కోసం చూస్తోంది. చాలామంది టీడీపీ నేతలతో టచ్ లో ఉంటోంది. దీంతో... చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యేలా ఉంది. చంద్రబాబు కుడి - ఎడమ భుజాలుగా భావించే నేతలు కూడా ఇప్పటికే బీజేపీలో చేరిన నేపథ్యంలో ఏ నేత పార్టీని వీడినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది.