Begin typing your search above and press return to search.

రాధా పాలిటిక్స్‌పై బీజేపీ న‌జ‌ర్‌.. వివ‌రాలు ఆరా..!

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:12 AM GMT
రాధా పాలిటిక్స్‌పై బీజేపీ న‌జ‌ర్‌.. వివ‌రాలు ఆరా..!
X
రాష్ట్రంలో రాజ‌కీయంగా పునాదులు బ‌లోపేతం చేసుకునేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోఎలాగైనా స‌రే.. అధికా రంలోకి రావాల‌ని.. బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ ప్రా రంభించింది. వ‌ర్గాలు.. త‌ర‌గతుల ఆధారంగా నాయ‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన పార్టీ చీఫ్ సోము వీర్రాజు.. ఇదే వ‌ర్గంపై కొన్నాళ్లుగా ఫోక‌స్ చేస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ.. కాపు ఓట్ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప‌రిస్తితి ఉంద‌ని.. ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుల‌పై ఫోక‌స్ పెట్టార‌నే చ‌ర్చ‌ బీజేపీ సీనియ‌ర్ల మ‌ధ్య‌సాగుతోంది.

ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉన్న‌.. వంగ‌వీటి రాధాకు బీజేపీ అనుకూలంగా ఉంద‌నే సంకేతాలు పంపుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు రాధా కాంగ్రెస్ నుంచి ప్ర‌జారాజ్యం.. అక్క‌డ నుంచి వైసీపీ.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు.

అయితే.. కాంగ్రెస్ త‌ర్వాత‌.. ఆయ‌న‌కు అంతా.. మైన‌స్‌గా మారిపోయింది. ఏ పార్టీలోనూ ఆయ‌న‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేదు. ఈ క్ర‌మంలో ఇప్పుడు బీజేపీ ఆయ‌న‌కు వ‌ల వేస్తున్న‌ట్టు బెజ‌వాడ పొలిటిక‌ల్ వ‌ర్గాలు అంటున్నాయి.

''ప్ర‌స్తుతం రాధా.. ఏ పార్టీలో ఉన్నారో.. చెప్ప‌డం క‌ష్టం. టీడీపీలో ఉన్నాన‌ని ఆయ‌న చెబుతున్నా.. అక్క‌డ టికెట్ వ‌చ్చే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి.. ఆయ‌న మా పార్టీలోకి వ‌స్తే.. ఫ్యూచ‌ర్ బాగుంటుంది'' అని విజ‌య‌వాడ‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఇక‌, సోము వీర్రాజు కూడా.. రాధా ప్రొఫైల్ గురించి అడిగి తెలుసుకున్నార‌ని.. చెబుతున్నారు. ఒక‌వేళ‌.. రాధా క‌నుక‌.. పార్టీలోకి వ‌స్తే..ఆయ‌న‌కు.. కోరుకున్న స్థానం నుంచి టికెట్ ఇప్పించేబాధ్య‌త‌ను కూడా సోము తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని రాధాకు ఏదో ఒక‌రూపంలో పంపించి.. ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు అయితే.. ఇప్పుడిప్పుడే.. ముందుకు సాగుతున్నాయ‌ని అంటున్నారు. దీనికి గుంటూరుకు చెందిన ఒక మాజీ మంత్రిని కూడా వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందోచూడాలి.