Begin typing your search above and press return to search.
ఏపీ అసెంబ్లీలో ఇక బీజేపీ ఎమ్మెల్యేలు..!?
By: Tupaki Desk | 29 Jun 2019 5:23 AM GMTవైసీపీ అధినేత జగన్ వదిలినా.. బీజేపీ మాత్రం టీడీపీని వదిలే ప్రసక్తే కనిపించడం లేదట.. ఇప్పటికే బీజేపీలోని కీలక నేతను రంగంలోకి దింపి నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసిన కమలం పార్టీ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలపై దృష్టి సారించిందట..
రాజ్యసభలో మొత్తం ఆరుగురు టీడీపీ ఎంపీలున్నారు. అందులో మూడింట రెండువంతుల మంది ఎంపీలు.. అంటే నలుగురు బీజేపీలో చేరడంతో నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు పడదు. పైగా విలీన వ్యూహాన్ని రూపొందించారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఏపీ అసెంబ్లీలోనూ ప్రయోగించడానికి రెడీ అయ్యిందట బీజేపీ
ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో బీజేపీ కండువా వేసుకొని కనిపించే ఎమ్మెల్యేలను త్వరలోనే చూడబోతున్నామట.. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ సీనియర్లు ఏపీలో రంగంలోకి దిగినట్టు భోగట్టా. ఇప్పటికే రహస్యంగా 14మంది టీడీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారట బీజేపీ పెద్దలు. మరో ఇద్దరితోనూ టచ్ లో ఉందట.. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు పైసా పుట్టని పరిస్థితి. బీజేపీలో చేరినా ఏపీలో ప్రతిపక్షమే కానీ.. కేంద్రంలో అధికారంలో ఉండడంతో లాభపడొచ్చు.
పైగా బీజేపీలో చేరే టీడీపీ ఎమ్మెల్యేలకు భారీగానే ఆఫర్ ఇస్తున్నారట బీజేపీ పెద్దలు. తమను ఇబ్బందులు పెట్టిన టీడీపీ అధినేతపై ప్రతీకారానికి ఎంతైనా ‘ఖర్చు’ పెట్టడానికి వెనుకాడడం లేదట. అందుకే త్వరలోనే 16మంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేసి వారిపై అనర్హత వేటు పడకుండా బీజేపీలోకి టీడీపీ విలీన వ్యూహాన్ని ఏపీ అసెంబ్లీ లో తెరపైకి తెస్తోందట కమళదళం. ఇదే జరిగితే టీడీపీ ఏడుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ 16మంది ఎమ్మెల్యేలతో ఏపీ అసెంబ్లీలోకి కనిపించనున్నారన్న మాట.. చూడాలి మరీ బీజేపీ ఏం చేస్తుందో..