Begin typing your search above and press return to search.
జగన్ కు మేలు చేసిన బీజేపీ
By: Tupaki Desk | 1 Jun 2016 6:03 AM GMTరాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున నాలుగో అభ్యర్థిని బరిలోకి దించుతామని ప్రకటించిన టీడీపీ ఆ విషయంలో ఎందుకు వెనక్కుతగ్గింది?ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తారని ధైర్యంగా చెప్పిన నాయకులు ఆ క్రమంలో విజయం ఎందుకు సాధించలేకపోయారు? పార్టీ నేతల సూచనలు అధినేత చంద్రబాబు ఓకే చెప్పేశారా? బీజేపీ వ్యవహారశైలి జగన్ కు మేలు చేసిందా? అంటే అవుననే సమాచారం వస్తోంది.
నాల్గవ అభ్యర్థి విషయంలో గత పదిహేను రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు - మంత్రులు - ఆ పార్టీ సీనియర్ లీడర్లు అన్ని కోణాల నుంచీ కసరత్తు చేశారు. నామినేషన్ల దాఖలుకు ఆఖరుతేదీ వరకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తొలుత ఉత్సాహ పడిన తెలుగుదేశం నాయకులు చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దీని వెనుక వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆ సాహసం చేయడానికి టీడీపీ వెనుకాడినట్లు సమాచారం. దాంతోపాటు టీడీపీ మద్దతుతో రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. టీడీపీ నాల్గవ అభ్యర్థిని నిలబెడితే బీజేపీ నుంచి వ్యతిరేకత వస్తుందని, ఒకవేళ రాజకీయ సమీకరణలు మారిపోయి సురేష్ ప్రభు ఓడిపోతే బీజేపీ నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని వెనకడుగు వేసినట్లు సమాచారం. తద్వారా టీడీపీ వెనక్కు తగ్గడం పరోక్షంగా వైఎస్ జగన్ కు మేలు చేసినట్లు అయిందంటున్నారు.
రాజ్యసభ షెడ్యూల్ విడుదల సమయానికి టీడీపీ-బీజేపీ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కలిపితే అధికారపక్షం బలం 108. వైసీపీ నుంచి దశలవారీగా ఫిరాయించిన 17 మందిని కూడా కలుపుకుంటే టీడీపీ బలం 125 అవుతుంది. నాలుగు రాజ్యసభ సీట్లూ కైవసం చేసుకోవాలంటే 144 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. దీనిప్రకారం టీడీపీ ఇంకా 19 మందికి తక్కువ కాకుండా వైసీపీ నుంచి లాక్కోవాలి. అంతపెద్ద మొత్తంలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించే పరిస్థితి లేదు. పైగా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌కు ఎమ్మెల్యేలు చూపించి ఓటు వేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వు ఉండనే ఉంది. ఇప్పటికే వైసీపీ సుప్రీంకోర్టులో ఫిరాయింపు అంశంపై కేసు వేసింది. అంతేకాకుండా ఇటీవలి ఉత్తరాఖండ్ పరిణామాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించడంపైనా టీడీపీలో అంతర్మధనం జరిగింది. ఈ నేపథ్యంలో బలం లేకపోయినా ఆషామాషీగా నాల్గవ అభ్యర్థిని నిలబెడితే మొదటికే మోసం వస్తుందని ఆలోచనలో పడింది. పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు తప్పించుకోవాలంటే వైసీపీకి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 67 మందిలో 23 మందిని లాగాలి. ప్రస్తుతం 17 మందే ఫిరాయించారు. ఇంకా ఆరుగురిని చేర్చుకుంటేనే అనర్హత నుంచి తప్పుకునే వీలుంది. ఆ మేరకు ఇప్పుడప్పుడే వైసీపీ నుంచి ఫిరాయించే కనిపించలేదు లేదు. నాల్గవ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి ఎంతైనా డబ్బులు పెట్టుకోడానికి సిద్ధపడాలని, అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల ఖర్చు మొత్తాన్నీ భరించాలని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకు స్పందించిన నెల్లూరు జిల్లా పారిశ్రామిక వేత్త ఒకరు మీరు 36 మంది ఎమ్మెల్యేలను చూపిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని ముందుకొచ్చినట్లు తెలిసింది.