Begin typing your search above and press return to search.
రాముడు, అల్లా మధ్య జరిగే ఎన్నికల యుద్ధం ఇది
By: Tupaki Desk | 24 Jan 2018 10:57 AM GMTపొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే రాజకీయం వేడెక్కుతోంది. కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. బంత్వాల్ నియోజకవర్గంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాముడు - అల్లాకు మధ్య జరిగే యుద్ధమని సునీల్ కుమార్ అనే ఆ ఎమ్మెల్యే అన్నారు. సునీల్ అసెంబ్లీలో కర్కాలా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బంత్వాలా ఎమ్మెల్యే - మంత్రి రామనాథ రాయ్ ఈ మధ్య మాట్లాడుతూ.. ఇక్కడ తాను సాధించిన వరుస విజయాలు అల్లా దయ అని - లౌకికవాదులైన ముస్లిం సామాజికవర్గం ఓట్ల వల్లే గెలిచానని అన్నారు. దీనిపై సునీల్ తీవ్రంగా మండిపడ్డారు.
ఓ ర్యాలీలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. `ఈ ఎన్నికలు హిందువుల ఆత్మగౌరవానికి పరీక్ష. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన వ్యక్తి తాను అల్లా దయ వల్ల గెలిచానని చెప్పుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది అని సునీల్ అన్నారు. అందుకే ఈసారి ఎన్నికలు రాజేష్ నాయక్ (బీజేపీ) - రామనాథ రాయ్ మధ్య కాదు. ఇది అల్లా- రాముడి మధ్య జరిగే ఎన్నికలు. వీళ్లలో ఎవరు కావాలో బంత్వాల్ ప్రజలు నిర్ణయించుకోవాలి. అల్లానే మళ్లీమళ్లీ గెలిపిస్తారా లేక రాముడిని ప్రేమించే వ్యక్తిని గెలిపిస్తారా నిర్ణయించుకోండి` అంటూ సునీల్ అన్నారు. కాగా, ఎమ్మెల్యే సునిల్ అసెంబ్లీలో బీజేపీ చీఫ్ విప్ గా ఉన్నారు.
ఆరుసార్లు గెలిచిన వ్యక్తి హిందువుల ఓట్లు వద్దన్నాడంటే ఇది మన గౌరవానికి పరీక్ష అని, ఇది బంత్వాల్ కే కాదు మొత్తం జిల్లాలోని హిందువులకే అసలు పరీక్ష అని సునీల్ కుమార్ చెప్పారు. అందుకే ఓట్లు వేసే విషయంలో... మత రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తుల విషయంలో సరైన తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు.