Begin typing your search above and press return to search.

గ్రేటర్ పోరు : కేంద్రమంత్రిని రంగంలోకి దించిన బీజేపీ!

By:  Tupaki Desk   |   23 Nov 2020 1:30 AM GMT
గ్రేటర్ పోరు : కేంద్రమంత్రిని రంగంలోకి దించిన బీజేపీ!
X
గ్రేటర్ పీఠం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా పక్కా ప్రణాళికలు రచించి , తమ వ్యూహాలని అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాక ఎన్నిక ఫలితం తర్వాత , రెట్టింపు ఉత్సాహంతో గ్రేటర్ లో బీజేపీ పాగా వేయడం కోసం సర్వశక్తులు వడ్డుతుంది. తాజాగా కేంద్రమంత్రులు కూడా రంగంలోకి దిగారు. కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలకు సాక్ష్యాలు ఇవేనంటూ ''6 ఏళ్లలో 60 వైఫల్యాలు'' పేరుతో టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ చార్జిషీట్ ను రూపొందించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం హైదరాబాద్ లో ఆ బుక్ లెట్ ను విడుదల చేశారు.

తెలంగాణలో రెండు కుటుంబాల పాలనే కొనసాగుతుంది అని . ఒకటి సీఎం కేసీఆర్ కుటుంబమైతే, రెండోది అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం. వీళ్లిద్దరూ కలిసి ఉమ్మడిగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడింది కుటుంబాల పాలన కోసం కాదు. అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం నడుపుతోన్న ఆస్పత్రుల్లోకి పేద ముస్లిలను రానీయకుండా గోసపెడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం ద్వారా మళ్లీ నిరంకుశ మేయర్ లా అవతరించాలని ఎంఐఎం తాపత్రయపడుతోంది. టీఆర్ ఎస్, కాంగ్రెస్ కు ఓటేస్తే.. ఎంఐఎంకు ఓటేసినట్టే. అదే ఎంఐఎంకు నేరుగా ఓటేస్తే చీలికను సమర్థించినట్లే అంటూ కేంద్రమంత్రి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయింది. కేసీఆర్‌‌ ఫ్యామిలీతోపాటు ఆయన సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర అప్పులు పెరుగుతూవచ్చాయన్నారు.

హైదరాబాద్‌‌ నగరాన్ని డల్లాస్, ఇస్తాంబుల్‌‌ లాగా గ్లోబల్ సిటీ చేస్తామని టీఆర్ ఎస్ గొప్పలు చెప్పారని, అయితే ,డల్లాస్, ఇస్తాంబుల్ పక్కన పెట్టి హైదరాబాద్ ను వరదల నగరంగా మార్చారని విమర్శించారు. సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. లక్ష మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి దిక్కు లేకుండా పోయింది. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కడతామని చెప్పి.. పట్టుమని వెయ్యి కూడా పూర్తి చేయలేదన్నారు. హైదరాబాద్ మేయర్ పీఠం మీద టీఆర్ఎస్ అనుబంధ ఎంఐఎం మేయర్ కూర్చోవాలా? లేదా బీజేపీ మేయర్ కావాలా అనే ప్రశ్న మీదే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని , గ్రేటర్ లో దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుంది అని అన్నారు.