Begin typing your search above and press return to search.
మోడీషాలతో కేసీఆర్ కు చెడిందిక్కడేనా?
By: Tupaki Desk | 9 May 2019 6:09 AM GMTమొన్నటివరకూ వారిద్దరూ ఫ్రెండ్స్.. కాంగ్రెస్ ను ఖతం చేయాలంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలే బెటర్ అని కేసీఆర్ స్కెచ్ గీయడం.. దానికి మోడీ సై అనడం.. ఎన్నికలు జరగడం.. కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కడం జరిగిపోయింది.. అయితే తాజా పరిణామాలు మాత్రం కేసీఆర్ పై బీజేపీ ఆగ్రహానికి కారణమయ్యాయి.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. కేసీఆర్ కు ఫోన్ చేసి నిలదీశారని.. రెండు పార్టీల మధ్య చెడిందనే వార్తలు టీఆర్ ఎస్ నుంచి వెలువడుతున్నాయి.
ఇటీవల లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ ఖాతా నుంచి నాయకులు రూ.8 లక్షలు ఇండియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని ఖర్చులకు తరలిస్తుండగా.. తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.. దీనిపై కేసీఆర్ కు వివరించినా ఆ డబ్బును వెనక్కి ఇవ్వలేదట.. దీనిపై బీజేపీ నాయకులు అమిత్ షాకు ఫిర్యాదు చేశారని.. అమిత్ షా ఫోన్ చేసి కేసీఆర్ ను నిలదీసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక మోడీపై నిజామాబాద్ రైతులు నామినేషన్ వేయడానికి వెనుక కేసీఆర్ ఉన్నారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లను కూడా మోడీ సీరియస్ అవ్వడానికి కారణమట.. ఇలా ఎన్నికలు ముగియగానే కేసీఆర్ తీరు మారిపోవడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోవడం లేదట.. దీనిపైనే సంబంధాలు చెడాయని సమాచారం.
అయితే బీజేపీ డబ్బు స్వాధీనంపై కేసీఆర్ వివరణ ఇచ్చినా కూడా బీజేపీ పెద్దలు వినిపించుకోలేదని సమాచారం. డబ్బు స్వాధీనంలో తమకు సంబంధం లేదని.. ఎన్నికల సమయంలో కోడ్ ఉండగా అధికారులే తనిఖీలు చేసి ఎన్నికల కమిషన్ కు అప్పగించారని చెప్పినట్టు సమాచారం. మొత్తం ఈ రెండు చర్యల వల్ల ప్రస్తుతం మోడీషాలకు, కేసీఆర్ కు దూరం పెరిగినట్టు సమాచారం.