Begin typing your search above and press return to search.
ప్రధమ పౌరురాలు : వారి మీద బీజేపీ ఫోకస్...?
By: Tupaki Desk | 10 Jun 2022 6:51 AM GMTరాష్ట్రపతి ఎన్నికల విషయం మీద బీజేపీ దృష్టి సారించింది. తమ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్ధిని గెలిపించుకోవడానికి సరిపడా మెజారిటీని బీజేపీ సాధించేసింది. దాంతో ఆ పార్టీ 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దానికి తగినట్లుగా అభ్యర్ధిని ఖరారు చేయడానికి చూస్తోంది. రాష్ట్రపతి ఎంపిక ఈసారి ఆచీ తూచీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2024లో జరిగే ఎన్నికలు, ఆ మీదట ఏర్పడబోయే ప్రభుత్వాల విషయంలో రాష్ట్రపతి అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు.
ఆయన నిర్ణయానుసారమే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అదే విధంగా వచ్చే ఎన్నికలను కనుక చూసుకుంటే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే చాన్స్ ఎటూ లేదని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే తక్కువ సీట్లు వస్తే కనుక అపుడు బంతి రాష్ట్రపతి కోర్టులోకి వెళ్తుంది. రాష్ట్రపతి సంతృప్తి చెంది ఎవరికి తొలి చాన్స్ ఇస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనక తక్కువ పడిన సీట్లను సమకూర్చుకోగలుతారు. కొత్త మిత్రులను కూడా వెతుక్కునే వెసులుబాటు లభిస్తుంది.
అందువల్ల రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక అంటే ఇలాంటివి అన్నీ కూడా బీజేపీ సీరియస్ గానే ఆలోచిస్తోంది అంటున్నారు. ఇక ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు రేసులో ముందు ఉన్నట్లుగా కనిపిస్తున్నా చాలా కొత్త పేర్లు కూడా ఇపుడు వినిపిస్తున్నాయి. సౌత్ కి ఈసారి చాన్స్ ఇవ్వాలనుకుంటే మోడీ షాల చూపు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీద కూడా ఉంది అంటున్నారు.
ఆమె తమిళనాడు ఆడపడుచు, తెలుగు వారి కోడలు. అందువల్ల ఆమెను రాష్ట్రపతి అభ్యర్ధిగా చేసేందుకు చురుకుగానే పరిశీలన జరుగుతోంది. ఈసారి రాష్ట్రపతి పదవిని బ్రాహ్మణ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే నిర్మలమ్మ పేరు ముందు ఉంటుంది అంటున్నారు. ఆమె విద్యాధికురాలు, పైగా సమర్ధవంతమైన పరిపాలన దక్షురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా ఆమె మోడీ ప్రధాని అయ్యాక కీలకమైన రక్షణ శాఖను చూసి ఇందిరమ్మ తరువాత తానే అనిపించుకున్నారు.
ఇక ఇపుడు ఆర్ధిక శాఖ మంత్రిగా కూడా మూడేళ్ళుగా కొనసాగుతున్నారు. ఇక నిర్మలమ్మ మీద మోడీ అమిత్ షాలకు అపరిమితమైన నమ్మకం. పైగా 2007లో ప్రతిభా పాటిల్ తరువాత మహిళను రాష్ట్రపతిగా చేయలేదు. మహిళను రాష్ట్రపతిగా చేసి ఆ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు.
ఇక నిర్మలమ్మతో పాటు తెలంగాణా గవర్నర్ తమిల సై పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆమె డైనమిక్ గవర్నర్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. ఆమె తమిళనాడుకు చెందిన వారు. దాంతో పాటు ఆమె సామాజిక నేపధ్యం, ఆమె ఉన్నత విద్యా నేపహ్ద్యం అన్నీ కూడా రేసులో ముందు నిలబెడుతున్నాయని అంటున్నారు. సౌత్ కార్డ్ కి ఆమె కూడా సరిపోతుంది అని ఆలోచిస్తున్నారు.
వీరితో పాటు జార్ఖండ్‌లో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన మొదటి గవర్నర్‌గా గిరిజన వర్గానికి చెందినందున ద్రౌపది ముర్ము రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెకు మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో మాత్రమే కాకుండా ఎన్‌డిఎ మిత్రపక్షాలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ముర్ము ఒడిశాలోని సంతాల్ తెగకు చెందినవారు. ఆరు రాష్ట్రాలలో ఎన్నికలతో పాటు, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి గిరిజన ఓటర్లకు తన చేరువ కావాలన్న ప్రయత్నాలను ప్రారంభించినందున గిరిజన అభ్యర్థి అవకాశాలను తోసిపుచ్చలేమని బిజెపి వర్గాలు అంటున్నాయి.
ఇక రేసులో ఉన్న మరొక పేరు మధ్యప్రదేశ్‌కు చెందిన అన్సూయా యుకే. ఆమె షెడ్యూల్డ్ తెగకు చెందినది. అలాగే యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పేరు కూడా ప్రచారంలో ఉంది. మొత్తానికి చూస్తే ఈసారి మహిళ ప్రధమ పౌరురాలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక కొత్త రాష్ట్రపతి పేరుని చూస్తే ద్రౌపది ముర్ము, నిర్మలమ్మల మధ్యనే టఫ్ ఫైట్ ఉంది అని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.