Begin typing your search above and press return to search.
బురఖా వేసుకున్న తనిఖీ చేయాల్సిందే
By: Tupaki Desk | 3 March 2017 8:12 AM GMTయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి, మలి విడత పోలింగ్ సందర్భంగా పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొత్త డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఆరు - ఏడవ విడత పోలింగ్ లో మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో నియమించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ను బీజేపీ కోరింది. బురఖా ధరించి పోలింగ్ బూత్ లకు వచ్చే మహిళలను తనిఖీ చేసేందుకు మహిళా పోలీసులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. తొలి, మలి విడత పోలింగ్ సందర్భంగా పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని ఆ పార్టీ ఈసీకి రాసిన లేఖలో తెలిపింది.ఇక మౌ - బలియా ప్రాంతాల్లో భారీ బలగాలను నియోగించాలని కోరింది.అక్కడ పలు పోలింగ్ బూత్ ల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
యూపీ అసెంబ్లీ ఎన్నికల చరమాంకంలో ఈసీని ఆశ్రయించాల్సి వచ్చిందని అడగ్గా తొలి దశ పోలింగ్ ల్లో జరిగిన అవకతవకలను స్ధానిక అధికారులు సవరిస్తారని వేచిచూశామని, అలా జరగకపోవడంతో ఈసీని అభ్యర్థిస్తున్నామని బీజేపీ ఉపాధ్యక్షుడు జేపీఎస్ రాథోడ్ చెప్పారు. యూపీ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో ముస్లిం మహిళలు పోలింగ్ కు తరలిరావడంపై బీజేపీ ఆలోచనలో పడింది. తొలుత ట్రిపుల్ తలాఖ్ పై తమ పార్టీ వైఖరి నేపథ్యంలో సానుకూల ఓటింగ్ ఉంటుందని భావించినా అందుకు భిన్నంగా జరగడంతో బీజేపీలో ఆలోచన మొదలైంది.
కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌కు ప్రచారం గురువారం ముగిసింది. తూర్పు యూపీలోని ఏడు జిల్లాల్లోని 49 అసెంబ్లీ స్ధానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అజంఘర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనూ ఆరోవిడత పోలింగ్ జరగనుండటంతో అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యానాధ్ నియోజకవర్గమైన గోరఖ్ పూర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనూ పోలింగ్ జరగనుంది.గ్యాంగ్ స్టర్ - ఎంఎల్ ఏ ముక్తర్ అన్సారీ నియోజకవర్గమైన మౌలో కూడా పోలింగ్ జరగనుండటంతో అక్కడ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.ఆరోవిడత పోరులో 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.72 కోట్ల మంది ఓటర్లు నిర్ధారించనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/