Begin typing your search above and press return to search.

బండి కాదు ఫైర్ బ్రాండ్ షాకింగ్ వ్యాఖ్యలు.. తండ్రికొడుకులకు జైలు ఖాయమట

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:04 AM GMT
బండి కాదు ఫైర్ బ్రాండ్ షాకింగ్ వ్యాఖ్యలు.. తండ్రికొడుకులకు జైలు ఖాయమట
X
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటి నుంచి తరచూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ లు ఇద్దరూ జైలుపాలు కాక తప్పదంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఎందుకిలా అంటే.. వారు చేసిన అవినీతే అన్న మాటను బండి సంజయ్ చెబుతుంటారు. దీనికి ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. కేసీఆర్ ను టచ్ చేసే దమ్ముందా? టచ్ చేసి చూస్తే తెలుస్తుంది.. ఏమవుతుందో? అంటూ గంభీర ప్రకటన చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా నిజామాబాద్ ఎంపీ కమ్ తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశ రాజధానిలోని ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ ల అవినీతిపై సీబీఐ.. ఈడీలు త్వరలోనే విచారణ ప్రారంభిస్తాయని.. వారిని వంద శాతం జైలుకు పంపుతామని స్పష్టం చేయటం గమనార్హం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన విధానం తెలిపిందని.. ఒప్పందం మేరకు కొంటామని చెప్పినా ఆందోళన ఎందుకు చేస్తున్నారో టీఆర్ఎస్ ఎంపీలు చెప్పాలన్నారు.

రైతుల్ని మభ్య పెడుతున్న కేసీఆర్ ముందు టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు. వెనుకా ముందు ఆలోచించకుండా బండి సంజయ్ నోటికి పని పెడుతుంటారని.. అందులో కొన్ని సంచలనం కోసం ఆయన మాటలు ఉంటాయన్న మాట వినిపించేది. బండి సంజయ్ నోటి నుంచి తరచూ వచ్చే.. జైలు మాట.. తాజాగా ఎంపీ అర్వింద్ నోటి నుంచి రావటం.. అది కూడా బరాబర్ అన్నట్లుగా ఉండటంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత లభిస్తోంది. నిజంగానే.. తండ్రికొడుకులకు జైలు తప్పదా? అదే జరిగితే.. తెలంగాణలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు భిన్నంగా ఉంటాయని చెప్పక తప్పదు.