Begin typing your search above and press return to search.

బీజేపీ.. సేన మధ్య స్నేహం చెడటానికి కారణం ఆమేనా?

By:  Tupaki Desk   |   22 Nov 2019 5:54 AM GMT
బీజేపీ.. సేన మధ్య స్నేహం చెడటానికి కారణం ఆమేనా?
X
ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఏళ్లకు ఏళ్లుగా.. ఆ మాటకు వస్తే దశాబ్దాల పర్యంతం బీజేపీ.. శివసేన మధ్య స్నేహబంధం సాగుతోంది. కొన్ని విషయాల్లో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నా.. చివర వరకూ వచ్చేసరికి మాత్రం రెండు పార్టీలు సర్దుబాటుతో ముందుకు సాగేవి. తమను పైకి ఎదగనీయకుండా బీజేపీ అంతకంతకూ బలపడుతుందన్న భావన సేనకు తరచూ కలగటం కూడా రెండు పార్టీల మధ్య చిటపటలకు కారణంగా చెబుతారు.

కాకుంటే ఒకే భావజాలమైన రెండు పార్టీలు కలిసి ఉంటే తప్పించి.. రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెట్టలేవన్న విషయాన్ని గుర్తించి వారు సాగుతున్నారు. మరి.. ఇలాంటి బంధం ఎందుకు బీటలు వారింది? సుదీర్ఘకాలంగా సాగుతున్న స్నేహబంధానికి బ్రేకప్ చెప్పేలా బీజేపీ.. సేనల మధ్య ఏం జరిగింది? ఎప్పటిలా రాజీ పడకుండా తెగే వరకూ విషయాన్ని ఎవరు తీసుకెళ్లారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

బీజేపీ.. సేనల మధ్య బంధం విచ్ఛిన్నం కావటానికి కారణం ఉద్దవ్ సతీమణి రశ్మీ ఠాక్రేనే అని చెబుతున్నారు. ఆమె అనుసరించిన మొండిపట్టుదలే తాజా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. తన కుమారుడు ఆదిత్యను ముఖ్యమంత్రి చేయాలని ఆమె తపిస్తున్నారు. అందుకు పట్టుపట్టిన ఆమె.. ఆ దిశగా పావులు కదిపేలా ఒత్తిడి పెంచారు.

అంతేకాదు.. ఠాక్రే మనమడికి సీఎం పీఠం దక్కాలన్న విషయాన్ని మలాడ్ లోని హోటల్లో బస చేసిన సేన ఎమ్మెల్యేలకు సైతం ఆమె స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఠాక్రే కటుుంబంలో ఆమె మాటే చెల్లుబాటు అవుతుందని.. ఈ నేపథ్యంలో తన కుమారుడికే సీఎం పీఠం దక్కాలన్న గట్టి పట్టుదలే తాజా పరిణామాలకు కారణంగా చెబుతున్నారు.