Begin typing your search above and press return to search.
జేపీ నడ్డా చెప్పులు ఏ గులాం మోస్తారన్న కేటీఆర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీజేపీ
By: Tupaki Desk | 27 Aug 2022 7:33 AM GMTమొన్నీ మధ్య అమిత్ షా వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వామిభక్తి చాటారు. ఓ ఆలయంలోకి వెళ్లివచ్చిన అమిత్ షాకు స్వయంగా చేతులతో ఆయన బూట్లు అందించారు. అది పెద్ద వివాదాస్పదమైంది. ఢిల్లీ, గుజారాతీలకు గులాంలుగా ఉంటారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతారా? అంటూ టీఆర్ఎస్ పెద్ద రచ్చనే చేసింది.
మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేసి మరీ ఎండగట్టారు. ఢిల్లీ పాలకుల చెప్పులు మోసే బానిసలు అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాతీ పాలకుల ముందు తాకట్టు పెట్టారని.. ఢిల్లీ గులాములు అంటూ బండిసంజయ్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న బీజేపీని తరిమికొడుతారు అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు.
ఆ తర్వాత బండి సంజయ్ సైతం దీనికి కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబ పాలనను, అవినీతిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు చేస్తూ కేసీఆర్ ఫ్యామిలీపై పోరాటం చేస్తున్నారు.
తాజాగా హన్మకొండలో బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నగరానికి రానున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. ఈరోజు జేపీ నడ్డా చెప్పులు ఏ గులాం మోస్తారు అంటూ 'పాప్ క్విజ్' అంటూ పేర్కొన్నారు. నడ్డా చెప్పులు మోయడానికి బీజేపీ నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఖచ్చితంగా తాను అనుకుంటున్నట్లు సెటైర్ వేశారు.
అయితే మంత్రి కేటీఆర్ చేసిన పోస్టుకు బీజేపీ సానుభూతి పరులు కార్యకర్తలు గట్టి కౌంటర్లే ఇస్తున్నారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపతో కాళ్లు మొక్కించుకున్న 'ట్విట్టర్ టిల్లు' కేటీఆర్ నీతులు చెబుతున్నాడు అంటూ కౌంటర్ ఫొటోలు వేసి ఎండగట్టారు. అంతేకాదు.. గతంలో ఆంధ్రా పాలకులకు ఫొటోలు తీసి చెంచాగిరీ చేసింది ఎవరు అంటూ కేటీఆర్ పై సెటైర్ వేస్తున్నారు.
ఇక జైలుకు పోయిన ఝార్ఖండ్ హంతక మాజీ సీఎం.. అవినీతిపరుడైన శిబు సోరెన్ కాళ్లు మొక్కిన కేటీఆర్ ఫొటోలను పోస్ట్ చేసి కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ చెప్పుల పోస్టులు.. ఆయన వ్యతిరేక పోస్టులతో ట్విట్టర్ మారుమోగుతోంది.