Begin typing your search above and press return to search.
ఆ సొమ్ముల్లో 93% బీజేపీకే!
By: Tupaki Desk | 17 Jan 2019 12:54 PM GMTభారతీయ జనతాపార్టీ మరో రికార్డు సాధించింది. జాతీయ పార్టీలకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 93 శాతం బీజేపీకే వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సర్వే వెల్లడించింది. రూ.20 వేలు - ఆ పైన విరాళాలను ఏడీఆర్ లెక్కలోకి తీసుకుంది. ఏడాది కాలంలో మొత్తం రూ.469.89 కోట్ల విరాళాలు రాగా.. అందులో రూ.437.04 కోట్లు కేవలం బీజేపీ ఖాతాలోకే వెళ్లడం విశేషం. తద్వారా కార్పొరేట్లు - వ్యక్తులు మరియు వివిధ రూపాల్లో 20 వేలకు మించి విరాళాలు సొంతం చేసుకున్న పార్టీగా బీజేపీ ప్రత్యేకతను సంతరించుకుంది.
ఎన్నికల సంఘానికి జాతీయ పార్టీలు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లను పరిగణనలోకి తీసుకొని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ ఈ నివేదిక రూపొందించింది. విరాళాల్లో బీజేపీ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కు రూ.26.65 కోట్లు - ఎన్సీపీకి రూ.2.08 కోట్లు - సీపీఎంకి రూ.2.7 కోట్లు - సీపీఐకి రూ.1.1 కోట్లు - టీఎంసీకి రూ.0.2 కోట్లు వచ్చాయి. రూ.20 వేలకు పైన తమకు ఎలాంటి విరాళాలు రాలేదని బీఎస్పీ తెలిపింది. ఈ అన్ని పార్టీలు కలిసి పొందిన విరాళాలకు 12 రెట్లు ఎక్కువ బీజేపీకి రావడం విశేషం. ఇక విరాళాల సంఖ్య పరంగా చూసుకున్నా.. మొత్తం 4201 విరాళాల్లో 2977 (70 శాతం) బీజేపీకే వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు కేవలం 777 విరాళాలు మాత్రమే వచ్చాయి. 2016-17లో మొత్తం రూ.589.38 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు 20 శాతం మేర తగ్గినట్లు తేలింది.