Begin typing your search above and press return to search.
కనీసం ఆరు సీట్లలో నెగ్గలేకపోతే బీజేపీ ప్రభుత్వం కూలుతుంది!
By: Tupaki Desk | 15 Nov 2019 1:30 AM GMTకర్ణాటకలో నంబర్ గేమ్ ఆసక్తిదాయకంగా మారింది. డిసెంబర్ ఐదో తేదీన కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మొత్తం పదిహేను స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి.
ప్రస్తుత బలాబలాల నేపథ్యంలో కనీసం ఆరు సీట్లలో భారతీయ జనతా పార్టీ కచ్చితంగా గెలవాల్సి ఉంది. పదిహేనులో కనీసం ఆరు సీట్లను గనుక నెగ్గలేకపోతే బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో పడిపోయే అవకాశాలున్నాయి.
పూర్తి స్థాయి మెజారిటీ లేకుండానే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీకి అక్కడ అవకాశం దక్కింది. అయితే మొత్తం అసెంబ్లీ సీట్ల లెక్కల ప్రకారం బీజేపీకి అక్కడ అవకాశం లభించలేదు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కావడంతో.. బీజేపీకి అవకాశం దక్కింది. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పడిపోయింది. బీజేపీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నియమిత స్పీకర్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేశారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ సపోర్ట్ ద్వారా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
ఇంతలోనే ఉప ఎన్నికలు వచ్చాయి. వీటిల్లో బీజేపీ కనీసం ఆరు నెగ్గితే మినిమం మెజారిటీని సంపాదించుకోగలదు. అయితే ఆ మాత్రం కూడా నెగ్గలేకపోతే మాత్రం బీజేపీ ప్రభుత్వం అక్కడ పడిపోయే అవకాశాలు లేకపోలేదు!