Begin typing your search above and press return to search.

అన్ని రాష్ట్రాల్లోనూ యూనిఫాం సివిల్ కోడ్‌: బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్‌

By:  Tupaki Desk   |   28 Nov 2022 3:38 AM GMT
అన్ని రాష్ట్రాల్లోనూ యూనిఫాం సివిల్ కోడ్‌: బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్‌
X
'ఇక‌, దేశం మునుప‌టిలా ఉండ‌బోదు!' అని భావిత‌రాల‌కు చెప్పాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే, దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ యూనిఫాం సివిల్ కోడ్‌(ఉమ్మ‌డి పౌర‌స్మృతి-యూసీసీ)ను అమ‌లు చేసేందుకు బీజేపీ రెడీ అయిపోయింది.

ఇదే విష‌యాన్ని తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చెప్పుకొచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి.. జాతీయాంశం అని నడ్డా అన్నారు. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

2024 సార్వత్రిక ఎన్నికలు ముందే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నడ్డా వెల్లడించారు. ఈ ఉమ్మడి పౌరస్మృతినే హిమాచల్ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్ల మేనిఫెస్టోల్లో ఆ పార్టీ ప్రస్తావించింది.

ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే యూసీసీని తప్పని సరిగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నడ్డా ఈ యూనిఫాం సివిల్ కోడ్ అన్నది జాతీయ అంశం అని అన్నారు. యాంటీ రాడికలైజేషన్ సెల్ ఏర్పాటు వేర్వేరని తెలిపారు.

'ఉమ్మడి పౌరస్మృతి అనేది జాతీయ అంశం.. దేశంలోని వనరులు ప్రజలందరికీ సమానం. అందువల్ల యూసీసీ అన్నది దేశవ్యాప్తంగా స్వాగతించదగిన చర్య. దీన్ని వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అమలు చేయాలనుకుంటున్నాము. సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే దుష్టశక్తులను అదుపుచేయడం దేశం బాధ్యత.

మానవ శరీరంలో యాంటీబాడీలు పనిచేసే విధంగా.. సంఘ వ్యతిరేక శక్తులను నియంత్రించడం దేశ బాధ్యత. కొందరు అజ్ఞాతంలో ఉండి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుం టారు. వారిని అదుపు చేయడం కోసం యాంటీ-రాడికలైజేషన్ సెల్ అవసరం.'' అని న‌డ్డా స‌మ‌ర్థించారు. అయితే, దీనిని ముస్లిం వ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.