Begin typing your search above and press return to search.
5 నెలలు.. బీజేపీకి ఎంత తేడా?
By: Tupaki Desk | 25 Oct 2019 6:30 PM GMTఐదు నెలల కిందటే దేశంలో అఖండమెజార్టీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ గద్దెనెక్కింది. మోడీ రెండోసారి ప్రధానిగా అయిపోయారు. ఇక ఆయన అనుంగ అనుచరుడు అమిత్ షా నంబర్ 2 పొజిషిన్ లో తిరుగులేని విధంగా ఉన్నారు..
అయితే 5 నెలల్లోనే బీజేపీ దక్కిన ఓట్ల శాతంలో ఇంత భారీ తగ్గుదల కమలదళాన్ని షాక్ కు గురిచేసింది. ఓటర్లు బీజేపీపై ఇంత త్వరగా అభిమానాన్ని చంపుకోవడం ఆ పార్టీ వర్గాలను షాక్ కు గురిచేసింది.
మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే బీజేపీకి హర్యానాలో ఏకంగా 30.5 శాతం ఓటు షేరింగ్ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 21.5శాతానికే పరిమితమైంది. అంటే ఐదు నెలల్లోనే ఏకంగా 9శాతం ఓటు షేరింగ్ పడిపోవడం కమలం పార్టీని షాక్ కు గురిచేసింది.
ఇక మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. మేలో వచ్చిన మెజార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి మధ్య ఏకంగా 9శాతం ఓటు షేరింగ్ బీజేపీకి తగ్గిపోయింది. దీన్ని బట్టి బీజేపీపై ఓటర్లలో ఈ ఐదు నెలల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా హిందుత్వా, జాతీయ వాదం ఎజెండా ముందుకెళుతున్న బీజేపీకి అది ఎంతో కాలం నిలవదని.. అభివృద్ధి, స్థానిక రాష్ట్ర అంశాలపైనే ఓటర్లు స్పందిస్తారని ఈ తీర్పుతో వెల్లడైంది. ఇప్పటికైనా బీజేపీ పెచ్చరిల్లుతున్న వ్యతిరేకత.. దేశ ప్రజల్లో పడిపోతున్న నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.