Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ పై ఫైట్.. బీజేపీ నేతలకు ఆయుధాలు.!

By:  Tupaki Desk   |   5 Sep 2019 8:40 AM GMT
టీఆర్ ఎస్ పై ఫైట్.. బీజేపీ నేతలకు ఆయుధాలు.!
X
తెలంగాణలో ఒకే ఒక అసెంబ్లీ సీటును బీజేపీ గెలిచింది.. పెద్దగా పదవులు లేవు.. ఉన్నోళ్లకే పదవులిచ్చారు.. అనుభవిస్తున్నారు. ఇటీవలే ఒకే ఒక్క గవర్నర్ పదవిని తెలంగాణకు కేంద్రం ఇచ్చింది. అదీ మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న తెలంగాణ నేత విద్యాసాగర్ రావును తొలగించి అదే తెలంగాణకు చెందిన దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించింది. దీంతో కొత్తగా తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేమీ లేదన్న చర్చ సాగుతోంది.

తెలంగాణ బీజేపీ దూకుడుగా లేకపోవడం.. నిరసనలు - ఆందోళనలు చేయకపోవడం వెనుక పదవులు లేవనే నిరాశ, నిసృహనే కారణమని అధిష్టానం గుర్తించిందట.. అందుకే ఇప్పుడు అనాదిగా పార్టీలో ఉన్న వారికి.. తాజాగా పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన జితేందర్ రెడ్డి - వివేక్ - డీకే అరుణ లాంటి వారికి కేంద్రంలోని నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయ్యిందట..

మొత్తంగా చాలా మంది పేర్లను ఇప్పుడు బీజేపీ అధిష్టానం లెక్కలోకి తీసుకున్నట్టు సమాచారం. అందులో ఇటీవలే పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ డీకే అరుణ - పెద్దిరెడ్డితోపాటు పార్టీ నేతలు ఇంద్రాసేన రెడ్డి - గరికపాటి మోహన్ రావు - మాజీ ఎంపీ వివేక్ - కృష్ణసాగర్ రావు - ధర్మారావు - సుగుణాకర్ రావు - సంకినేని వెంకటేశ్వరరావు - జంగారెడ్డి - రాజేశ్వరరావు - బండారు శ్రావణిలకు పదవులు ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ డిసైడ్ అయినట్లు సమాచారం.వీందరికీ కేంద్రంలో భారీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో ఏదైనా పదవులు ఇచ్చేందుకు రెడీ అయ్యిందట..

ఇలా పదవులు ఇస్తే నైనా తెలంగాణలో బీజేపీకి జోష్ పెరుగుతుందని.. తద్వారా అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పై పోరాడుతారని బీజేపీ అధిష్టానం భావిస్తోందట.. మరీ బీజేపీలో వస్తున్న ఈ పదవుల పండుగతోనైనా పార్టీ నేతలు గులాబీ దళంపై యుద్ధం ప్రకటిస్తారా? లేదా ఇప్పటిలాగానే సైలెంట్ గా ఉంటారా అన్నది వేచిచూడాలి.