Begin typing your search above and press return to search.
పుంజుకుంటున్న బీజేపీ
By: Tupaki Desk | 14 Jan 2016 7:30 AM GMTగ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గత వారం పది రోజులుగా భారీగా పుంజుకుంటోందని విశ్లేషకులు వివరిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూలు నోటిఫికేషన్ ముందుకు, ఆ తర్వాత పరిస్థితికి మార్పు వచ్చిందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేతలు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒళ్లు వంచి పని చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇందుకు ఆ పార్టీ అధినేత అమిత్ షా హెచ్చరిక కూడా కారణమని వివరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడానికి కొద్ది రోజుల ముందు బీజేపీ నేతలంతా కలిసి ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల మధ్య ఏమాత్రం సమన్వయం లేని విషయాన్ని అమిత్ షా గుర్తించారు. రాజాసింగ్ వ్యవహారంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మిగిలిన నేతల మధ్య అగాథం ఉన్న విషయం గమనించారు. దాంతో పార్టీ నేతలకు మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డికి భారీగా క్లాసు పీకారని సమాచారం. ‘‘మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతున్నాను. మీరు తెచ్చిన అర్జీలు, దరఖాస్తులకు ప్రభుత్వంలో మీకంతా సానుకూల వైఖరి ఉండేలా చేస్తున్నాను. కానీ, మీరు మాత్రం పార్టీ విషయంలో ఏకతాటిపై ఉండడం లేదు. ఈసారి జీహెచ్ఎంసీపై ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగరాల్సిందే. లేకపోతే మీరు మళ్లీ నాకు ముఖం చూపించవద్దు. అది కావాలి ఇది కావాలంటూ నా దగ్గరకు రావద్దు’’ అని నిష్కర్షగా నిర్మొహమాటంగా తేల్చి చెప్పినట్లు తెలిసింది. దాంతో కిషన్ రెడ్డితోపాటు మిగిలిన నాయకులందరిలోనూ చురుకు పుట్టింది.
గ్రేటర్లో బీజేపీకి ఎంతో కొంత పట్టుంది. సెటిలర్లంతా కలిసికట్టుగా ఓటు వేసే టీడీపీతో పొత్తుంది. అదే సమయంలో ఎంతో కొంత మోదీ హవా ఉంటే.. కేసీఆర్ పై ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. అంటే, గ్రేటర్ పరిధిలో సానుకూల వాతావరణం ఉన్నా.. దానిని తాము క్యాష్ చేసుకోలేకపోతున్నామని బీజేపీ నేతలు అప్పటికి గుర్తించారు. ఆ వెంటనే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఆర్ఎస్ఎస్, ఇతర అనుబంధ సంఘాలను కలుపుకుని క్షేత్రస్థాయిలో దిగారు. దాంతో వారం పది రోజులుగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు. రాబోయే పది పదిహేను రోజులూ మరింత ఉత్సాహంతో పని చేస్తే మాత్రం టీడీపీ, బీజేపీ కూటమి జెండా ఎగరేసినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.