Begin typing your search above and press return to search.
అఖిలేష్ దూకుడు.. కమలం పార్టీకి చుక్కలేనా?
By: Tupaki Desk | 13 Dec 2021 1:30 AM GMTమరికొద్ది నెలల్లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవడం.. ఒక సవాలైతే.. అత్యంతకీలకమైన అవసరం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం. అతిపెద్ద రాష్ట్రం.. 80కి పైగా ఎంపీ స్తానాలున్న యూపీని దక్కించుకుంటేనే కేంద్రంలో అదికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ తలపొస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అనేక అభివృద్ధి పనులకు కేంద్రం శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుండడం గమనార్హం. అయితే.. బీజేపీ ఇలా దూకుడుగా ముందుకు సాగుతుంటే.. ఇక్కడి ప్రధాన ప్రతిపక్షం, మాజీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు.. అఖిలేష్ దూకుడు మరింత పెంచారు.
వచ్చే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని పొత్తు రాజకీయాలకు తెరదీశారు. అంతేకాదు.. బీజేపీ నుంచి కూడా వలసలను ప్రోత్సహించారు. దీంతో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇబ్బందుల్లో పడుతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. అదేసమయంలో ఎస్పీ.. నేత అఖిలేష్ సామాజిక వర్గాల వారీగా కూడా పట్టు పెంచుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో పూర్వాంచల్‌లో బ్రాహ్మణ ఓట్లపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పూర్వాంచల్ రాజకీయాల్లో బ్రాహ్మణ వర్గానికి చెందిన మాజీ మంత్రి హరిశంకర్ తివారీ కుటుంబాన్ని అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీలో చేర్చుకున్నారు. హరిశంకర్ తివారీతో పాటు ఆయన కుమారుడు పార్టీ కండువా కప్పుకొన్నారు.
అదేసమయంలో ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ, హరిశంకర్ తివారీ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు మరియు మాజీ ఎంపీ కుశాల్ తివారీ మేనల్లుడు గణేష్ శంకర్ పాండే కూడా ఎస్పీకి జైకొట్టారు. బ్రాహ్మణ వర్సెస్ ఠాకూర్ రాజకీయాల మధ్య, హరిశంకర్ తివారీ కుటుంబం ఎస్పీకి వెళ్లడం పూర్వాంచల్ సమీకరణాలను మార్చగలదని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాంతం బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువ. పైగా హరిశంకర్ తివారీ పూర్వాంచల్‌లో బ్రాహ్మణులకు పెద్దగా వ్యవహరిస్తున్నారు. హరిశంకర్ తివారీ కుటుంబం ఎస్పీలో చేరడం బీజేపీతో పాటు మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఆందోళన కలిగించే అంశం.
యూపీ ప్రస్తుత రాజకీయాల్లో ఈ కుటుంబం చాలా కాలంగా సత్తా చాటుతోంది. ముఖ్యంగా పూర్వాంచల్ కుల సమీకరణాలలో వీరి జోక్యాన్ని ఎవరూ ఖండించలేరు. 80వ దశకంలో హరిశంకర్ తివారీ – వీరేంద్ర ప్రతాప్ షాహీల మధ్య ఆధిపత్య పోరు బ్రాహ్మణ వర్సెస్ ఠాకూర్ అనే రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు మరోసారి.. ఈ సమీకరణలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. హరిశంకర్ తివారీ చిల్లుపర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కళ్యాణ్ సింగ్ రాజ్‌నాథ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
హరిశంకర్ పెద్ద కుమారుడు కుశాల్ తివారీ సంత్ కబీర్‌నగర్ నుండి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. చిన్న కుమారుడు వినయ్ శంకర్ తివారీ చిల్లుపర్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, హరిశంకర్ తివారీ మేనల్లుడు గణేష్ శంకర్ పాండే బీఎస్పీ ప్రభుత్వంలో శాసనమండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తివారీ కుటుంబం ఎస్పీలో చేరడం బీఎస్పీతో పాటు బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. ఇక్కడే బీఎస్పీకి సోషల్ ఇంజినీరింగ్ ఎదురుదెబ్బగా పరిగణిస్తోంది.
మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణుల అసంతృప్తి కొన్ని స్థానాల్లో కూడా బీజేపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎస్పీ-బీఎస్పీ-కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు బ్రాహ్మణులను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. అయితే.. బ్రాహ్మణులను ఆకట్టుకునేందుకు అయోధ్య రామమందిరాన్ని పాశుపతాస్త్రంగా బీజేపీ భావిస్తుండడం గమనార్హం. అదేసమయంలో పలు ప్రాజెక్టులను తీసుకువచ్చామని.. నిర్మిస్తున్నామని.. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే.. అవన్నీ.. తమ హయాంలోరూపుదిద్దుకున్న ప్రాజెక్టులేనని అఖిలేష్ చెబుతున్నారు. ఇలా మొత్తంగా చూస్తే.. బీజేపీకి అఖిలేష్ పెద్ద సవాలే రువ్వుతున్నారని అనడంలో సందేహం లేదు.