Begin typing your search above and press return to search.
మనకో మీడియా.. డిసైడ్ అయిన బీజేపీ నేతలు.. ఏం చేస్తారు?
By: Tupaki Desk | 15 April 2021 5:30 PM GMTరాష్ట్ర బీజేపీలోని కీలక మేధావులు.. కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, విష్ణువర్ధన్‌రెడ్డి.. ఇలా ఓ ఏడుగురు తాజాగా నెల్లూరులో భేటీ అయ్యారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్య ర్థి రత్నప్రభ గెలుపుపై వారు అంచనాలు వేసుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న ప్రచారం తీరు.. రత్నప్రభకు ఉన్న ఎడ్జ్ వంటి పలు విషయాలపై వారు సమాలోచనలు చేశారు. అయితే.. అనుకున్న విధంగా ప్రోగ్రెస్ కనిపించడం లేదని తేల్చారు. దీనికి కారణాలు సైతం వెతికారు.
ప్రధానంగా మీడియా ప్రచారంలో బీజేపీ వెనుకబడిందని కన్నా, పురందేశ్వరి స్పష్టం చేశారు. కొన్నాళ్లుగా ఒక అనుకూల మీడియా తమను ఫోకస్ చేస్తున్నా.. తిరుపతి ఎన్నికల సమయంలో మాత్రం హ్యాండిచ్చేసిం దనే నిర్ణయానికి వచ్చారు. పైగా వైసీపీకి సొంత మీడియా ఉండడంతో ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడినా పదే పదే చూపిస్తున్నారు. అదేసమయంలో వైసీపీకి డిజిటల్ వింగ్ కూడా తోడుగా ఉంది. దీంతో అటు సాధారణ మీడియా.. ఇటు డిజిటల్ మీడియా కూడా వైసీపీకి ఇప్పుడు ప్రచారం చేస్తోంది. ఇక, టీడీపీకి డిజిటల్ వింగ్ తో పాటు.. కొన్ని చానెళ్లు కూడా ప్రచారంలో దోహదపడుతున్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
కానీ, బీజేపీ పరిస్థితి మాత్రం ఇప్పుడు ప్రచారం లేక.. ఇబ్బంది పడుతున్నట్టు తేల్చారు. ఇటీవల పార్టీ జాతీ య అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా ఆయన సభను ప్రత్యక్ష ప్రసారం చేయించడంలో నేతలు విఫలమయ్యారు. మొత్తంగా ఈ పరిణామాలు.. అంచనా వేసుకున్న బీజేపీ నేతలు.. తమకు కూడా ఒక ఛానెల్ అవసరమని.. నిర్ణయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల సమయంలోగా సొంత మీడియాను ఏర్పాటు చేసుకోకపోతే.. పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతుందని అంచనా వేసుకున్నారు.
త్వరలోనే ఈ విషయాన్ని పార్టీ జాతీయ కార్యవర్గం దృష్టికి తీసుకువెళ్లి.. ఎంత ఖర్చయినా.. చానెల్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీకి సొంత మీడియా చానెళ్లు ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఏపీలోనూ ఏర్పాటు చేసుకుంటేనే తప్ప.. ఎదగడం కష్టటమని నిర్ణయానికి రావడం గమనార్హం.