Begin typing your search above and press return to search.
కుంభమేళాకు రండి : కేటీఆర్ కు బీజేపి ఆహ్వానం
By: Tupaki Desk | 29 Dec 2018 4:28 PM GMTఏమాటకామాటే. సామాన్యుల్లో కోపాలు...పట్టుదలలు...వ్యతిరేకతలు... ముఖాలు చూసుకోకపోవడాలు వంటివి కామన్. కాని రాజకీయ పార్టీల్లోను, ఆ పార్టీల నాయకుల్లోనూ మాత్రం ఇలాంటివి అస్సలు ఉండవు. అందుకేనేమో... రాజకీయాల్లో శాశ్వత శత్రువులు...శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఇది భారత రాజకీయ ముఖచిత్రంలో మాటిమాటికీ కనపడుతూనే ఉంటుంది. ఈమధ్యనే ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఉప్పు, నిప్పులా, ఎడముఖం, పెడముఖంలా వ్యవహరించి... ఒకరినొకరు దుమ్మతి పోసుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల తాజాగా ఆ వైరాన్ని మరచిపోయినట్లు ఉంది. ఇద్దరు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ.... ఒకరి ఉత్సవాలకు మరొకరిని ఆహ్వానించుకుంటూ ప్రాణ స్నేహితుల్లా కలిసిపోతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యానిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆహ్వానం అందింది. అది కూడా ఎలాంటి ఆహ్వానం అనుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆధ్మాత్మిక కార్యక్రమం కుంభమేళాకు రావాల్సిందిగాపిలుపు.
పలు రాష్ట్రాల్లో జరిగే వివిధ శుఖ కార్యాలయాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులను ఆహ్వానించడం మామూలే. అందులో పెద్ద వింత కూడా ఏమీ లేదు. అయితే, ఈమధ్యనే తెలంగాణలో ముగిసిన ఎన్నికల్లో ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకుడు కల్వకుంట్ల తారక రామారావును ఉత్తర్ ప్రదేశ్ కు ఆహ్వానించడమే పెద్ద వింత. ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరుగనున్న మహా కుంభమేళాకు రావాల్సిందిగా తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావును ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్ మహానా శనివారం కలుసుకుని స్వయంగా ఆహ్వానించారు. జనవరి 15నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో మహా కుంభమేళ జరుగనుంది. దేశంలోనే ఈ కుంభమేళకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారు. ఇంతటి మహా వేడుకకు రావాల్సిందిగా కల్వకుంట్ల తారక రామారావును ఆహ్వానించేందుకు ఉత్తర్ ప్రదేశ్ మంత్రే స్వయంగా రావడం ఇక్కడ విశేషం.