Begin typing your search above and press return to search.
బీజేపీ దేశానికి పట్టిన క్యాన్సర్
By: Tupaki Desk | 21 April 2018 2:41 PM GMTబీజేపీ లక్ష్యంగా సినీ నటుడు ప్రకాష్‌రాజ్ విమర్శలు కొనసాగుతున్నాయి. జర్నలిస్ట్ గౌరీలంకేశ్ మరణం అనంతరం నుంచి తన విమర్శలను సంధిస్తున్న ప్రకాశ్ రాజ్ అనంతరం ఆ దాడిని విస్తృతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన సన్నిహితంగా మారారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆయన టూర్లలో ప్రకాశ్ రాజ్ ఉంటున్నారు. తాజాగా మరోమారు బీజేపీపై ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డారు. దేశానికి పట్టిన కేన్సర్ బీజేపీ అని ధ్వజమెత్తారు.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో విలేఖరులతో మాట్లాడిన ప్రకాష్‌రాజ్.. కేంద్రంలోని నేతల్లో నియంతృత్వ ధోరణి ఎక్కువైందని అన్నారు. బీజేపీ కేన్సర్ వంటిదని, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు దగ్గు, జలుబు వంటివని.. ఈ రెండింటి కంటే కేన్సర్ నియంత్రణకే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. తాను ఏ పార్టీకీ అనుకూలం కాదని, మతోన్మాద పార్టీలకు మాత్రం వ్యతిరేకినేనని స్పష్టం చేశారు. తాను ఓ పౌరుడిని మాత్రమేనని, ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని చెప్పారు. బీజేపీకి ఓటెయ్యొద్దని చెప్పే హక్కు ఓ పౌరుడిగా తనకు ఉన్నదని ప్రకాష్‌రాజ్ అన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీతో జేడీఎస్ కలిసే ప్రసక్తే లేదని, ఈ విషయంపై దెవెగౌడ తనకు హామీ ఇచ్చారని చెప్పారు.
ఇదిలాఉండగా...కర్ణాటకలో వచ్చే నెల 12న మొత్తం 224 స్థానాలకుగానూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగయినా ఈ ఎన్నికలలో గెలవాలని కాంగ్రెస్ యోచిస్తున్న సమయంలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బళ్లారి ఎమ్మెల్యే ఎన్.వై. గోపాలకృష్ణ ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ సీఎం అభ్యర్థి ఎడ్యూరప్ప గోపాలకృష్ణకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇది నిజంగా కాంగ్రెస్‌కు అతిపెద్ద షాక్ అని పలువురు అంటున్నారు. కాంగ్రెస్ కి పట్టు ఉన్న బళ్లారి ప్రాంతంలో గోపాలకృష్ణను చేర్చుకోవడం బీజేపీకి అనుకూలంగా మారనుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ దాని మిత్రపక్షాలు.. కర్ణాటకలో కూడా తమ జెండాను ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.