Begin typing your search above and press return to search.
బీజేపీ అదే రాజకీయం చేస్తోంది..
By: Tupaki Desk | 8 Nov 2019 11:30 AM GMTమహా రాష్ట్ర లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. శుక్రవారం తో అసెంబ్లీ ఏర్పాటు గడువు ముగియబోతోంది. శివసేన - బీజేపీ పొత్తు పంచాయితీ తేలక పోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యం లోనే కర్ణాటక లో వలే మిగతా పక్షాల ఎమ్మెల్యే లను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాని కి బీజేపీ రెడీ అవుతోందని శివసేన ఆరోపిస్తోంది. లేకుంటే రాష్ట్రపతి పాలన విధిస్తామని బెదిరిస్తోందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన కామెంట్ చేశారు.
మహా రాష్ట్ర లో బీజేపీ కి మరో ఆప్షన్ లేదు. శివసేన లేదా ఎన్సీపీతో కలిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. బీజేపీ కి మహారాష్ట్ర 105 సీట్లు మాత్రమే ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 145. ఈ నేపథ్యం లోనే బీజేపీ తో శివ సేన (56 సీట్లు), ఎన్సీపీ (54 సీట్లు) లు కలిస్తే మహారాష్ట్ర లో ప్రభుత్వం నిలబడుతుంది. కానీ శివ సేన సీఎం పీఠాన్ని 50-50 చేసుకుందామని అంటుండడంతో బీజేపీ ఒప్పుకోవడం లేదు.
కాగా శివసేన కలిసి రాకపోవడంతో బీజేపీ తనకు కావాల్సిన మెజార్టీ కోసం అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రలోభాలకు గురిచేయడానికి రెడీ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయ్యింది. కాంగ్రెస్ కు చెందిన 44 ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలించింది. ఇక శివసేన కూడా ముంబైలోని హోటల్ కు తమ ఎమ్మెల్యేలను తరలించి కాపాడుకుంటోంది.
అయితే కర్ణాటక లో వలే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలున్నా మెజార్టీకి బీజేపీ చాలా దూరంలో ఆగిపోవడంతో సాధ్యపడడం లేదు. మరి ఈ రాత్రికి గడువు ముగుస్తుండడం తో బీజేపీ ఏం చేస్తుంది? కర్ణాటక ప్లాన్ వర్కవుట్ చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఏదీ సాధ్య పడకపోతే ఇక మహా రాష్ట్ర లో రాష్ట్రపతి పాలనే చివరి ఆప్షన్ గా బీజేపీ ఎంచుకుంటోంది.