Begin typing your search above and press return to search.

మోడీ చేసిన డ్యామేజ్ ను కవర్ చేసుకోలేకపోతున్న బీజేపీ?

By:  Tupaki Desk   |   2 Oct 2019 4:30 AM GMT
మోడీ చేసిన డ్యామేజ్ ను కవర్ చేసుకోలేకపోతున్న బీజేపీ?
X
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటనను బాగా ఉపయోగించుకోవాలని బీజేపీ భావించింది. అందుకు తగ్గట్టుగా మోడీకి అక్కడ బ్రహ్మాండమైన ఆదరణ దక్కిందని బీజేపీ వాళ్లు ప్రచారం చేసుకున్నారు. అయితే అది మోడీకి దక్కిన ఆదరణ కాదని.. భారత ప్రధానికి దక్కిన ఆదరణ అని కాంగ్రెస్ వాళ్లు కౌంటర్లు వేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేత శశిథరూర్ ఒకప్పటి ఫొటోలను బయటకు తీశారు. అప్పట్లో నెహ్రూ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయనను చూడటానికి విదేశీయులే ఎగబడిన ఫొటోలను శశిథరూర్ షేర్ చేశారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే నెహ్రూకు అంతటి ఆదరన లభించింది విదేశాల్లో అంటూ శశి కౌంటర్ ఇచ్చారు.

ఇక ఇండియాకు గత ఐదేళ్లలో విదేశాల్లో బాగా గౌరవం పెరిగిందంటూ మోడీ మరింత డ్యామేజ్ చేసుకున్నారు. గత ఐదేళ్లలోనే ఇండియాకు గౌరవం పెరిగిందని మోడీ చెప్పుకోవడం సామాన్యులకు కూడా రుచించే అంశం కాదు. ఇండియాకు తన వల్లనే గౌరవం పెరిగిందంటూ మోడీ చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది ఆ మాటలతో.

ఆ సంగతలా ఉంటే.. మోడీ అంతకన్నా పెద్ద బాంబు పేల్చారక్కడ. అమెరికాలో వచ్చేసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నెగ్గాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ఆల్రెడీ ట్రంప్ తో ప్రపంచం తలబొప్పి కట్టించుకుంది. ఇండియన్స్ అయితే ట్రంప్ తో మరింతగా ఇక్కట్ల పాలయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ట్రంప్ నెగ్గాలంటూ మోడీ పిలుపునివ్వడం విమర్శలకు తావిస్తోంది.

అంతే కాదు.. ఇలా విదేశాల్లో ఫలానా వాళ్లు నెగ్గాలని - ఓడాలని మన దేశ నేతలు చేసే వ్యాఖ్యలు కూడా మన దేశ విదేశాంగ విధానానికి విరుద్ధం. అలాంటి విధాన వ్యతిరేక పిలుపును ఇచ్చారు మోడీ. దీంతో కాంగ్రెస్ వాళ్లు విరుచుకుపడుతున్నారు. అయితే మోడీ మాటలను సీరియస్ గా తీసుకోవద్దంటూ విదేశాంగశాఖ కవర్ చేస్తోంది. ప్రధాని మాటలనే సీరియస్ గా తీసుకోకపోతే ఎలా అని.. కాంగ్రెస్ వాళ్లు విరుచుకుపడుతున్నారు!