Begin typing your search above and press return to search.
చంద్రబాబు పరపతి అంతగా చితికిపోయిందా?
By: Tupaki Desk | 13 March 2016 5:55 AM GMTప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశాన్ని ఏలిన సమయంలో ఆయనకు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వాజ్ పేయ్ హయాంలో ఒక వెలుగు వెలిగిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు అందుకు భిన్నంగా ఉందని సంజయ్ బారు వ్యాఖ్యానించారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో చంద్రబాబుకు ఎంతో గౌరవం ఉండేదన్న సంజయ్ బారు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఉందన్న విషయాన్ని తన తాజా పోలికతో చెప్పేశారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ.. రాజ్ నాథ్ సింగ్ లు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే.. చంద్రబాబు అందుకు భిన్నంగా కుర్చీలో ఒక అంచున బెరుకుగా కూర్చున్నట్లుగా విజువల్స్ కనిపించాయని.. ఢిల్లీలో సంఖ్యాబలానికే విలువ ఉంటుందన్న అసలు విషయాన్ని చెప్పేశారు.
ఏపీ ఆర్థిక లోటు, పక్కలో బల్లెం వంటి కేసీఆర్ తదితరు కారణాల వల్ల ప్రస్తుతం మోడీ సర్కారులో భాగమైనా కూడా చంద్రబాబు మోడీ బ్యాచ్ తో బెరుకు.. బెరుకుగా కాలం గడిపేస్తున్నారన్న అనుమానం సంజయ్ వ్యాఖ్యలతో ఖరారైపోయింది. ఎందుకంటే పలువురు అధినేతల్ని దగ్గర నుంచి చూడటంతోపాటు.. దేశ రాజకీయాల మీద పట్టున్న సంజయ్ బారు లాంటి వ్యక్తి నోటి నుంచి మాట వచ్చిందంటే అంత తేలిగ్గా వదిలేయలేని పరిస్థితి.