Begin typing your search above and press return to search.
వైసీపీ మీద కత్తి పెట్టి టీడీపీని లేపుతున్న బీజేపీ!
By: Tupaki Desk | 29 Aug 2022 6:56 AM GMTఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. బీజేపీకి ఏపీలో చూస్తే క్యాడర్ లేదు, నాయకులు కూడా అసలు లేరు. పోలింగ్ బూత్ స్థాయిలో కూడా నాయకులు అసలు బీజేపీకి లేరు. పరిస్థితి ఇలా ఉంటే దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యే సీట్లు కావాలన్న అత్యాశ కాషాయం పార్టీది. ఆ పార్టీ కేంద్ర పెద్దల రాజకీయ అతి ఇలాగే ఉంటుంది అంటే ఆశ్చర్యం ఏమీ లేదు కూడా. ఏదో విధంగా ప్రతీ చోటా పాగా వేయాలన్నదే బీజేపీ ప్లాన్.
ఇక ఏపీలో చెప్పుకోవడానికి వైసీపీ సర్కార్ ఉన్నా బీజేపీ అనుకూల వైఖరితోనే ఉంది. జగన్ ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తాను అని చెబుతున్నా కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం అసలు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు అంటున్నారు. ఇక ఏపీలో వైసీపీ 175 సీట్లకు 175 సీట్లు మావే అని గట్టిగా బల్ల గుద్దుతోంది. అయితే తమకు కూడా ఏపీలో రాజకీయ వాటా కావాలన్నదే ఇపుడు బీజేపీ నయా ప్లాన్.
ఈ విషయంలోనే బీజేపీ వైసీపీ మీద పెద్ద ఎత్తున వత్తిడి పెంచుతోంది అంటున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీతో పొత్తు అంటూ బీజేపీ యాక్టింగ్ చేస్తున్నారు అని అంటున్నారు. నిజానికి టీడీపీకి బీజేపీ దగ్గర అవుతోంది అన్నది చూపించి వైసీపీలో టెన్షన్ పెట్టాలన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.
ఏపీలో తాము బలమైన రాజకీయ ఆల్టర్నేషన్ గా మారాలని బీజేపీకి ఉంది. దాని కోసం వైసీపీతో పొత్తు పెట్టుకోమని వత్తిడి తెస్తోంది అని అంటున్నారు. అయితే ఇన్ డైరెక్ట్ గా ఎంతవరకూ అయినా వైసీపీ మద్దతు ఇవ్వగలదు కానీ ఒకసారి పొత్తు అంటూ వైసీపీ బీజేపీతో తెర ముందుకు వస్తే కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో సమీకరణలు మారిపోతాయి.
ఏపీలో వైసీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంది. ఎస్సీస్, ఎస్టీస్ తో పాటు ముస్లిం మైనారిటీలు ఆ పార్టీకి అండగా ఉంటున్నారు. బీజేపీతో వైసీపీ కలిస్తే కచ్చితంగా ఆ ఓట్లు అన్నీ వైసీపీ కోల్పోవాల్సి వస్తుంది. అంత వరకూ ఎందుకు జగన్ సొంత జిల్లా కడప లోక్ సభ సీట్లోనే ఏకంగా రెండు లక్షల మంది దాకా ముస్లిమ్స్ ఉన్నారు. మరి అక్కడ రాజకీయ జాతకం పూర్తిగా తారు మారు అవుతుంది అన్నది చాలా ఈజీగా చెప్పేయవచ్చు.
ఇదిలా ఉంటే బీజేపీతో వైసీపీ కలవడం అంటే ఏపీలో కచ్చితంగా అది టీడీపీని పైకి లేపినట్లే అవుతుంది అని అంటున్నారు. ఎపుడైతే వైసీపీకి ముస్లిం మైనారిటీ వర్గాలు తలాఖ్ అంటారో వారు వెళ్లి టీడీపీకే డ్యామ్ ష్యూర్ గా మద్దతు ఇస్తారు. ఆ విధంగా జగన్ కంచుకోటగా ఉన్న రాయలసీమలో అతి పెద్ద కన్నం పడిపోతుంది. అది ఒక్క ఎన్నికతో కాదు, ఏకంగా వైసీపీ పునాదులే సమాధి అయ్యేలా ఈ పరిణామం దారితీస్తుంది.
దాంతోనే ఇపుడు వైసీపీ ఏమీ చేయలేక ఆలోచిస్తోంది అని అంటున్నారు. అయితే ఏపీలో బీజేపీ ఆశలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. తమ పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవాలి. వారు చట్ట సభలకు రావాలి. మరి ఈ విషయంలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యమయ్యేది. కానీ జగన్ ససేమిరా అనేస్తున్నారు. అందుకే బీజేపీ కేంద్ర పెద్దలకు మండుకొస్తోందిట. వారు ఈ విషయాన్ని బయటకు ఎక్కడా దాచుకోవడం లేదు. టీడీపీకి ఒక వైపు కన్ను గీటుతూ తమ రాజకీయ బేరాలేమిటో వైసీపీకి చెప్పేస్తున్నారు.
ఒక విధంగా చూస్తే బీజేపీ వైఖరి వైసీపీకి ఇబ్బందికరంగానే ఉంది అంటున్నారు. ఏపీకి అన్ని రకాలుగా అన్యాయం చేసిన పార్టీగా బీజేపీ ఉంది. ఆ పార్టీ మీద ఏపీ జనాలు ఆగ్రహోదగ్రులై ఉన్నారు. ఏపీకి ఏ ఒక్క సాయం చేయకుండా కేవలం తన రాజకీయం మాత్రమే తాను బీజేపీ చూసుకుంటోంది అన్న మంట ప్రజలకు ఉంది. ఇక ఎనిమిదేళ్ల మోడీ పాలనలో ఎన్నో ఫెయిల్యూర్స్, జనాల నెత్తిన పెట్టిన భారాలు చాలానే ఉన్నాయి.
అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ వ్యతిరేకత అంతా కూడా వైసీపీ మీదనే పడుతుంది అన్నది వాస్తవం. అపుడు బీజేపీకి సీట్లు కాదు, వైసీపీ గెలుపు కూడా డౌట్ లో పడుతుంది. అందువల్లనే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా వైసీపీ పరిస్థితి ఉందిట. ఈ పరిణామాలు మాత్రం టీడీపీ నెత్తిన పాలు పోసేవే అని అంటున్నారు.
వైసీపీ బీజేపీ కలిస్తే మాత్రం ఏపీలో టీడీపీ దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీకి దూరంగా ఉన్న మైనారిటీ సెక్షన్లు కూడా కలుస్తాయి కాబట్టి. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా చాలా నియోజకవర్గాలలో మైనారిటీలు ఉండడం కూడా టీడీపీకే ప్లస్ అవుతుంది అంటున్నారు. మొత్తానికి వైసీపీ మీద బీజేపీ కత్తి పెట్టేసింది. దాని నుంచి ఒడుపుగా తెలివిగా ఆ పార్టీ ఎలా తప్పించుకుంటుందో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.