Begin typing your search above and press return to search.

ఉమ్మ‌డి పౌర‌స్మృతి.. ఎందుకంత‌ 'హాట్' అయింది?

By:  Tupaki Desk   |   11 Dec 2022 7:30 AM GMT
ఉమ్మ‌డి పౌర‌స్మృతి.. ఎందుకంత‌ హాట్ అయింది?
X
దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ యూనిఫాం సివిల్ కోడ్‌(ఉమ్మ‌డి పౌర‌స్మృతి-యూసీసీ)ను అమ‌లు చేసేందుకు బీజేపీ రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన ప్రైవేటు బిల్లును తాజాగా రాజ్య‌స‌భ‌లో బీజేపీ నేత‌లే ప్ర‌వేశ పెట్టారు.. ఒక అత్యంత కీల‌క‌మైన ఒక విష‌యానికి సంబంధించి వేసిన కీల‌క అడుగు. ఇక‌, ఇక్క‌డ క‌నుక ఇది ఆమోదం పొందితే.. కేంద్రం ప‌రుగును ఎవ‌రూ ఆప‌లేరనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.

2024 సార్వత్రిక ఎన్నికలు ముందే దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్‌ అమలుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోందనేది వాస్త‌వం. ఈ ఉమ్మడి పౌరస్మృతినే ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్ర‌చారం చేశారు. యూనిఫాం సివిల్ కోడ్ ను బీజేపీ జాతీయ అంశంగా చెబుతోంది. అయితే, వాస్త‌వానికి ఉమ్మ‌డి పౌర‌స్మృతి అనేది.. ఆర్ ఎస్ ఎస్‌విధానంగా ఉంది.

ఎందుకంటే.. ఆర్ ఎస్ ఎస్ వాద‌న ప్ర‌కారం ఇది హిందూ దేశం. హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం మ‌నుషు లంతా ఒక్క‌టే. సో.. ఒకే సంస్కృతి, ఒకే సంప్ర‌దాయాలు.. ఒకే క‌ట్టుబాట్లు పాటించాల‌నేది ఆర్ ఎస్ ఎస్ చెబుతున్న విధానం. ఈ క్ర‌మంలోనే ఉమ్మడి పౌరస్మృతి అనేది జాతీయ అంశంగా బీజేపీప్ర‌చారం చేస్తోంది.

బీజేపీ చెబుతున్న సూక్తులు చూస్తే.. దేశంలోని వనరులు ప్రజలందరికీ సమానం. మతాలు వేరైనా.. పాటిం చాల్సిన నియ‌మాలు మాత్రం ఒకే విధంగా ఉండాలి. అనుస‌రించాల్సిన ప‌ద్ధ‌తులు కూడా ఒకే విధంగా ఉం డాలి అని!! అయితే, దీనిని ముస్లిం వ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. బ‌హుభార్య‌త్వం.. సంతాన పుష్ఠి వంటివి.. ముస్లింల అస్తిత్వాన్ని తెలియ‌జేస్తాయ‌నేదివారి వాద‌న‌.

ఇప్పుడు దీనిపైనే కేంద్రం గురి చూసింది. నిజానికి ఒక్క ముస్లింల‌నే కాదు.. పార్సీలు, జైనులు, బుద్ధుల‌పైనా ఈ సివిల్ కోడ్ ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. అయితే, మైనారిటీల్లోనే వీరు కూడా ఉన్న‌ప్ప‌టికీ. ముస్లింల మాదిరిగా అయితే బ‌య‌ట ప‌డ‌డం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.