Begin typing your search above and press return to search.

మునుగోడు ఫలితాలు ఆలస్యం.. బీజేపీ అనుమానాలు

By:  Tupaki Desk   |   6 Nov 2022 7:41 AM GMT
మునుగోడు ఫలితాలు ఆలస్యం.. బీజేపీ అనుమానాలు
X
మునుగోడులో ఎప్పుడో 4వ రౌండ్ పూర్తయ్యాక గంటర్నర వరకూ కూడా 5వ రౌండ్ ఫలితాలు వెల్లడించలేదు. 10 గంటల తర్వాత 11.30 గంటల వరకూ మరో రౌండ్ ఫలితాలు వెల్లడికాలేదు. టీఆర్ఎస్ రౌండ్లలో ఆధిక్యంలోపై వెంటనే చెబుతున్న అధికారులు బీజేపీ రౌండ్లలో ఆధిక్యంపై ఆలస్యం చేస్తున్నారని.. బీజేపీ మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితోపాటు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం విమర్శలు గుప్పించారు. మునుగోడులో ఫలితాల ఆలస్యంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీకి 1430 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ఫలితాల వెల్లడిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏదో మతలబు జరుగుతోందని పసిగట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్‌కి ఫోన్ చేశారు. కౌంటింగ్ పారదర్శకంగా జరగడం లేదని టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా ఎన్నికల సంఘంపై మండిపడ్డారు.

ప్రతి రౌండ్‌ తర్వాత ఫలితాలను వెల్లడించడంలో ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్యం వహిస్తోందని టీఆర్‌ఎస్‌ కూడా ఆరోపిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల్లో న్యూఢిల్లీ నుంచి పోల్ అబ్జర్వర్లు ఉన్నారని, ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ఢిల్లీలోని వ్యక్తులను సంప్రదించి మరీ ఫలితాలను ప్రకటిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

అయితే, ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత ఫలితాలను ప్రకటించే ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని పేర్కొంది. ఐదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 32,405 ఓట్లు రాగా, బీజేపీకి 30,975 ఓట్లు వచ్చాయి.

ఇక ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం మునుగోడు రూరల్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 2169కు చేరింది.