Begin typing your search above and press return to search.
దేశం లో బీజేపీ అందు లో కూడా టాపే అంట..!
By: Tupaki Desk | 13 Nov 2019 6:16 AM GMTబీజేపీ ..భారతీయ జనతా పార్టీ .. 2014 ఎన్నికల్లో దేశం మొత్తం సత్తా చాటిన ఈ బీజేపీ పార్టీ .. అప్పటివరకు నిరంతరాయం గా కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి లోక్ సభ లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కేంద్రం లో అధికారం చేపట్టడానికి కేవలం తన పార్టీ ఎంపీల తోనే క్లియర్ మెజారిటీ సాధించిన పార్టీ గా కూడా అవతరించింది. మొత్తంగా గత మూడు దశాబ్దాలు గా కనిపించని క్లియర్ మెజారిటీని చూపించి ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కే మైండ్ బ్లాంకయ్యేలా చేసింది బీజేపీ.
ఇక తాజాగా జరిగిన ఎన్నికల లో సైతం మరోసారి బీజేపీ తన సత్తా ఏంటో చూపించింది. వరుసగా రెండోసారి కూడా క్లియర్ మెజారిటీ సాధించింది అధికారం చేపట్టింది. దీని తో తిరుగులేని పార్టీగా అవతరించి ..దేశంలో కొన్నేళ్లు గా పేరుకు పోయిన అత్యంత క్లిష్టమైన సమస్యలని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుంది. ఈ నేపథ్యం లోనే బీజేపీ తాజా గా మరో ఫీట్ సాధించింది.
అదేమిటంటే .. ప్రస్తుతం దేశం లో ధనిక పార్టీ ఏదన్న ప్రశ్న వినిపించిందంటే... ఏ మాత్రం తడుము కోకుండా బీజేపీనేనని చెప్పేసే పరిస్థితి ఉంది. ఆ వివరాలు ఒకసారి చూస్తే... గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2018-19 ఏడాదికి గాను అందిన విరాళాల వివరాలను బీజేపీ వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరం లో వివిధ సంస్థలు, ట్రస్టుల ద్వారా మొత్తం రూ.700 కోట్ల నిధులు పార్టీ కి అందినట్లు తెలిపింది. డిజిటల్ చెల్లింపులు, చెక్కుల రూపం లోనే ఈ మొత్తం సమకూరిందని.. ఈ మొత్తమంతా వైట్ మనీనేనని ఆ పార్టీ నేతలు ఘనంగానే ప్రకటించారు. ఈ విరాళాల్లో దాదాపు సగానికి పైగా టాటా సన్స్ కు సంబంధించిన ట్రస్టు నుంచే వచ్చిందని తెలుస్తోంది. టాటా సన్స్ కు చెందిన ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే బీజేపీ కి రూ.356కోట్ల నిధులు అందినట్లు సమాచారం. రూ.20 వేలు అంత కంటే ఎక్కువ విరాళాలను పూర్తిగా ఆన్‌లైన్ లోనే స్వీకరించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.