Begin typing your search above and press return to search.
కన్నా సీట్లోకి సోము... టీడీపీ, బీజేపీ దోస్తానా ముగిసిన అధ్యాయమే
By: Tupaki Desk | 29 July 2020 12:30 AM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం కావడం ఎలా అనే అంశంపై చాలా కాలం నుంచే తీవ్రంగానే ఆలోచిస్తోంది. కర్ణాటక, తెలంగాణలను అలా పక్కనపెడితే... తమిళనాడుతో పాటు ఏపీలో బీజేపీకి అసలు ఏమాత్రం సానుకూల ఫవనాలు వీయడం లేదు. కేరళలో ఆ పార్టీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇదే పరిస్థితిని మరింత కాలం కొనసాగించేందుకు బీజేపీ సిద్ధంగా లేదని చెప్పక తప్పదు. అందులో భాగమే ఇప్పుడు బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగిన సీనియర్ రాజకీయవేత్త కన్నా లక్ష్మీనారాయణను ఆ స్థానం నుంచి తప్పించి.. అందులో పార్టీకి వీర విధేయుడిగా పేరుపడ్డ సోము వీర్రాజును కూర్చోబెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఏపీలో తనను ఎంతమాత్రం ఎదగనీయకుండా తనదైన శైలి వ్యూహాలు అమలు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును తమ పార్టీకి మరింత దూరం పెట్టేందుకు కూడా సోమును బీజేపీ ఎంపిక చేసిందన్న వాదనలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.
తెలుగు నేల రాజకీయాలను ఓ సారి పరికించి చూస్తే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక పార్టీతో దోస్తానా కట్టాలంటే... ఆ పార్టీ నేతలకు టీడీపీనే కనిపించేది. అంతేకాకుండా ఒంటరిగా ఏనాడూ ఎన్నికలను ఎదుర్కోని చంద్రబాబుకు బీజేపీ అవసరం మరింత ఎక్కువగా కనిపించింది. మొత్తంగా పలు మార్లు టీడీపీ, బీజేపీ జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లాయి. ఇలా ఎన్నికలకు వెళ్లినప్పుడల్లా... అధిక ప్రయోజనం చంద్రబాబుకే దక్కింది తప్పించి బీజేపీకి ఒనగూరింది ఏమీ లేదన్న వాదనలూ లేకపోలేదు. అయితే 2019 ఎన్నికలు బీజేపీకి ఓ గుణపాఠం చెప్పాయన్న విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపించాయి. 2014 ఎన్నికల్లో తన మద్దతుతో గద్దెనెక్కిన చంద్రబాబు... 2019 ఎన్నికలు వచ్చేసరికి తమనే ఓడించేందుకు కంకణం కట్టుకున్న వాడికి మల్లే వ్యవహరించిన తీరుతో బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందని చెప్పాలి. ఈ క్రమంలో ఇకపై చంద్రబాబుతో దోస్తానా గీస్తానా జాన్తా నై అన్నట్టుగానే బీజేపీ పెద్దలు అడుగులు వేశారు. భవిష్యత్తులో టీడీపీతో మైత్రి వద్దేవద్దన్నట్లుగా కూడా బీజేపీ పెద్దలు ఓ గట్టి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే... చంద్రబాబును తమ పార్టీ దరిదాపుల్లోకి కూడా రానీయకుండా చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కూడా బీజేపీ పెద్దలు భావించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా చర్యల్లో భాగంగానే చంద్రబాబుకు, టీడీపీకి అనుకూలంగా బాగా ఊదుతున్న కన్నాకు మరో టెర్మ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పపేందుకు బీజేపీ అదిష్ఠానం ససేమిరా అన్నదట. అంతేకాకుండా చంద్రబాబును బీజేపీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చేయాలంటే ఏం చేయాలన్న భావనతో... సుధీర్ఘంగానే ఆలోచించిన బీజేపీ... కన్నా ప్లేస్ లోకి సోము వీర్రాజును ఎంపిక చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా కన్నా ప్లేస్ లోకి సోమునే ఎందుకు తీసుకువచ్చారు? అసలు బీజేపీ ఉద్దేశ్యం ఏమిటన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
2014 ఎన్నికల తర్వాత ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఓ మోస్తరు ప్రాధాన్యమే ఇచ్చరన్న వార్తలు వినిపించాయి. అయినా కూడా తమ మిత్రపక్ష పార్టీ అధినేత అయినా కూడా సోము వీర్రాజు... చంద్రబాబుపై ఓ రేంజిలో ఫైరయ్యేవారు. నేరుగా చంద్రబాబు, నారా లోకేశ్ ల అవినీతిపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన సోము... నిత్యం టీడీపీ ప్రభుత్వానికి పంటికింద రాయి మాదిరే పరిణమించారని చెప్పక తప్పదు. అయినా కూడా బీజేపీ అధిష్ఠానానికి భయపడ్డ చంద్రబాబు.. సోముకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వక తప్పలేదు, అయినా కూడా చంద్రబాబు అవినీతిపై ఏనాడూ గళం తగ్గించని సోము.. చంద్రబాబు అవినీతిని చీల్చి చెండాడనే చెప్పాలి. మొత్తంగా చంద్రబాబు తరహా రాజకీయాలపై పూర్తి వ్యతిరేకత కలిగిన సోమును బీజేపీ ఏపీ చీఫ్ ను చేస్తే... తమ పార్టీ దరిదాపుల్లోకి కూడా చంద్రబాబు రాలేరన్న భావనతోనే బీజేపీ అధిష్ఠానం సోమును ఎంపిక చేసిందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా... సోమును ఎంపిక చేసిన బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు తమ గేట్లను పూర్తిగా మూసేసినట్టేనని చెప్పక తప్పదన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.