Begin typing your search above and press return to search.
బీజేపీ స్పీడ్ కు బ్రేకులు వేసే మగాడే లేడా?
By: Tupaki Desk | 12 Nov 2020 12:30 AM GMTవిజయం మీద విజయం. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ప్రజా వ్యతిరేకత ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నా.. దేశ ఆర్థిక స్థితి ఏ మాత్రం బాగోలేదని నిపుణులు పేర్కొంటున్నా.. కోవిడ్ వేళ అనుసరించిన విధానాలు ఏ మాత్రం సరిగా లేవన్న మాటలు జోరుగా వినిపిస్తున్నా.. ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీనే విజయం సాధించటం.. రాష్ట్రాల వారీగా అధికారాన్ని చేజిక్కించుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు.. ఇలా అయితే బీజేపీకి చెక్ పెట్టేటోడే లేడా? అన్నది పెద్ద ప్రశ్న. బిహార్ ఎన్నికలతో మోడీ స్పీడ్ కు బ్రేకులు వేయటమే కాదు.. కమలం జోరుకు కళ్లాలు పడతాయని భావించారు. ఇందుకు తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అయితే.. ఓట్ల లెక్కింపు వేళ మాత్రం సీన్ మొత్తం మారిపోవటమే కాదు.. బీజేపీకి తిరుగులేదన్న విషయం బిహార్ ఓట్ల లెక్కింపు స్పష్టం చేసింది.
ఐదేళ్ల క్రితం బిహార్ లో బలమైన శక్తిగా భావించిన జేడీయూ కంటే కూడా తాజా ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటిన వైనం దేశంలోని ఇతర పార్టీలకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ఇక .. కాంగ్రెస్ పరిస్థితి అయితే మరింత ఇబ్బందికరంగా మారింది. పదకొండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని ప్రదర్శించటమే కాదు.. సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్న చోట కూడా విజయఢంకా మోగించిన తీరు.. ప్రత్యర్థి పార్టీలకు మింగుడుపడటం లేదు.
మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నిలుపుకోవటం.. యూపీలో సత్తా చాటితే.. గుజరాత్ లో అయితే సమీప భవిష్యత్తులో బీజేపీని ఢీ కొనే శక్తి సాధ్యం కాదన్న పరిస్థితి. ఇప్పుడు వెలువడిన ఫలితాలు చూస్తే.. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ శక్తి లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ అంతకంతకూ విస్తరించటం కూడా చాలా పార్టీలకు మింగుడుపడటం లేదు.
యూపీ.. గుజరాత్ లలో బీజేపీ అభ్యర్థుల్ని సరిగా అడ్డుకోలేని ప్రతిపక్ష పార్టీల తీరు చూస్తే.. ఆ పార్టీ జోరుకు చెక్ పెట్టే నాథుడే లేడా? అన్నది సందేహంగా మారింది. ఉత్తర.. తూర్పు.. పశ్చిమ భాగంలోనే కాదు.. దక్షిణాదిన.. అందునా తెలంగాణలోని దుబ్బాకకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మోడీకి.. బీజేపీ దూకుడుకు కళ్లాలు వేయాలంటే బీజేపీయేతర పక్షాలన్ని ఒక కూటమి కావటం అవసరమని అంటున్నారు. అలా జరిగినా కూడా.. ఆ కూటమికి నాయకత్వం వహించే నేతకు ఇమేజ్ అవసరం. అది కూడా మోడీకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది. ఇదంతా చూస్తున్నప్పుడు.. ఇవన్నీకావటానికి మరికొన్నేళ్లు సమయం పడుతుందన్న మాట వినిపిస్తోంది. అప్పటివరకు మోడీ ప్రభకు తిరుగులేదన్న మాట.