Begin typing your search above and press return to search.
కేసులు పెట్టి పెద్దాయనకు తోడుంటారా?
By: Tupaki Desk | 20 April 2017 9:44 AM GMTఇప్పటి విషయాన్ని పక్కన పెడితే.. 2014 ఎన్నికల సమయంలోనూ.. బీజేపీ పేరు చెప్పినంతనే రెండు పేర్లు ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తుంటాయి. ఆ రెండు పేర్లలో ఒకటి ఎల్ కే అద్వానీ. ఆ మాటకు వస్తే.. దేశ వ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్న ప్రధాని మోడీలోని సినిమాను గుర్తించి.. ఆయన్ను దగ్గరకు తీసుకొని.. పార్టీలో ఎదిగేందుకు తన శక్తియుక్తుల్ని.. పేరు ప్రఖ్యాతుల్ని విరివిరిగా వినియోగించిన వారిలో అద్వానీ ముందుంటారు. మోడీకి గురువైన అద్వానీకి తాజాగా ఎదురవుతున్న ఇబ్బందులు.. సమస్యలు చూస్తున్న వారంతా విస్తుపోతున్నారు.
ఎక్కడైనా శిష్యుడి మాంచి పొజిషన్లో ఉంటే.. గురువును నెత్తిన పెట్టుకోవటం కనిపిస్తుంది. కానీ.. మోడీ విషయంలో మాత్రం సీన్ రివర్స్. మంత్రిమండలిలో పెద్ద వయసు పేరుతో పక్కన పెట్టినా.. ఆయన స్థాయికి తగినట్లుగా రాష్ట్రపతి పదవిని అయినా ఇచ్చి.. మోడీ తన గురుదక్షిణ చెల్లించుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ.. అలాంటిదేమీ ఇప్పుడు కనిపించట్లేదు. ఆ మధ్యన అద్వానీని రాష్ట్రపతి పదవికి తప్పనిసరిగా ఎన్నిక అయ్యేలా మోడీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదన్న వాస్తవం ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు చెప్పకనే చెప్పేస్తున్నాయి.
అప్పుడెప్పుడో ముగిసిన అధ్యాయం లాంటి బాబ్రీ మసీదు ఇష్యూను మళ్లీ తెర మీదకు తీసుకురావటమే కాదు.. ఆ ఇష్యూ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం వద్దకు వెళ్లేలా సీబీఐ వ్యవహరించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. సీబీఐ ఏంటి? అద్వానీ అండ్ కోల మీద సుప్రీంకోర్టుకు వెళ్లటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో.. మోడీ వ్యతిరేకుల మాట మరోలా ఉంది. రాష్ట్రపతి పదవికి అద్వానీని ఎన్నుకోకుండా ఉండటానికి.. రేసులోకి రాకుండా చేయటానికి వీలుగా మోడీ తనదైన శైలిలో ప్లానింగ్ చేసినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వాదనకు తగిన లాజిక్ చూపిస్తుండటంతో ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. కష్టకాలంలో ఉన్న అద్వానీకి పార్టీ వెన్నంటి ఉంటుందంటూ పార్టీ చీఫ్.. మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా వ్యాఖ్యానించటం విశేషం. బాబ్రీ ఇష్యూ నేపథ్యంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై నిన్న సాయంత్రం పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసింది. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి మాట్లాడారు అమిత్ షా. ఈ ఉదంతం గురించి విన్న అద్వానీ అభిమానులంతా మండి పడుతున్నారు. చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడేమీ తెలీనట్లుగా మాట్లాడుతున్నారంటూ అమిత్ షా అండ్ కోపై నిప్పులు చెరుగుతున్నారు. పెద్దాయన పరువు డ్యామేజ్ చేసేలా వ్యవహరించి.. ఇప్పుడు ఆయనకు అండగా నిలుస్తానని చెబుతారా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కీలక నేతపై సీబీఐ అప్పీలు కోసం సుప్రీంను ఆశ్రయించటం ఏమిటంటూ ఫైర్ అవుతున్నారు. పెద్దాయన్ను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే మోడీ పరివారం చాలా బాగా తొక్కేశారని.. అది సరిపోదన్నట్లుగా తాజా కేసుల పేరుతో మరింత రచ్చ చేస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దాయన్ను అభిమానించేవారికి ఆమాత్రం ఆగ్రహం ఉండటంలో తప్పు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/