Begin typing your search above and press return to search.
అమీర్ వ్యాఖ్యలపై ఇలా కక్ష సాధించాలనుకున్నారా
By: Tupaki Desk | 27 Dec 2016 11:19 AM GMTఎన్నికల ముందు సోషల్ మీడియాను పార్టీ గెలుపు కోసం అద్భుతంగా వినియోగించుకుంది భారతీయ జనతా పార్టీ. అదే సోషల్ మీడియాతో కక్ష సాధింపులకు కూడా దిగిందా అంటే.. అవుననే చెప్పాలి. అమీర్ నటించిన దంగల్ చిత్రం ఈ మధ్యనే విడుదలై మంచి పేరు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మాజీ వంటీర్ ఒకామె అమీర్ విషయాన్ని ఇప్పుడు తెరమీదికి తీసుకొచ్చారు. అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నస్నాప్ డీల్ కంపెనీపై ఒత్తిడి పెంచేందుకు భాజపా ప్రయత్నించిందని, ఈ మేరకు పార్టీ సోషల్ మీడియా వర్గాలకు కూడా ఆదేశాలు అందాయన్న ఆరోపణ చేశారు భాజపా మాజీ ఐటీ వలంటీర్ సాద్వీ ఖోస్లా.
దేశంలో అసహనం గురించి గతంలో అమీర్ ఖాన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అసహనం పెరిగిపోతోందనీ, ఇండియా విడిచి ఫ్యామిలీలో ఎక్కడికైనా వెళ్లిపోదామా అని భార్య తనను అడిగిందని అప్పట్లో అమీర్ వ్యాఖ్యానించాడు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఆ తరుణంలో అంటే, 2016 జనవరితోనే స్నాప్ డీల్ తో అమీర్ కాంట్రాక్ట్ ముగిసింది. తరువాత అమీర్ ను ఆ కంపెనీ కొనసాగించలేదు. ఆ వ్యాఖ్యలకు ప్రతిఫలంగానే ఫేస్ బుక్ - వాట్సాప్ ద్వారా అమీర్ పై భాజపా యుద్ధం ప్రకటించిందని సాద్వీ ఖోస్లా ఆరోపించారు. గతంలో ఈమె భాజపా సోషల్ మీడియా వలంటీర్ గా పని చేశారు. ఐయామ్ ద ట్రోల్ అనే పుస్తకం ఆమె రాశారు. ఈ పుస్తకంలోనే భాజపాపై ఈ ఆరోపణలు చేశారు.
అమీర్ ఖాన్ పై ఒత్తిడి పెంచుతూ స్నాప్ డీల్ నుంచి ఆయన్ని తొలగించేలా నెటిజెన్ల నుంచి మద్దతు పెంచాలన్నది అప్పటి భాజపా వ్యూహం అని ఆమె పుస్తకంలో రాశారు. గతంలోనే పార్టీ ఐటీ సెల్ ఛీఫ్ నుంచే ఈ విషయమై తనకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించారని ఆ బుక్ లో చెప్పారు. అమీర్ ను తొలగించే విధంగా ఒక ఫిర్యాదు తయారు చేసి, ఆ పిటిషన్ పై ఆన్ లైన్ ద్వారా సంతకాలు సేకరించేందుకు ప్రయత్నించారని ఆమె అంటున్నారు. అయితే, ఈ ఆరోపణలపై పార్టీ ఐటీ సెల్ ఛీఫ్ అరవింద్ గుప్తా తాజాగా స్పందించారు. సాద్వీ ఖోస్లా ఆరోపణలు అర్థం లేనివని ఆయన కొట్టి పారేశారు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన తోసిపుచ్చారు. అయితే, ప్రస్తుతం సోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుంది చెప్పండీ..!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/