Begin typing your search above and press return to search.
బీజేపీ-జనసేన.. పొత్తు పొడిచేనా?
By: Tupaki Desk | 25 Jan 2021 5:30 PM GMTతిరుపతి ఎంపీ సీటులో ఎవరు పోటీచేయాలనే దానిపై జనసేన-బీజేపీ కాంప్రమైజ్ కు వచ్చి ఈరోజు హైదరాబాద్ లో చర్చలు షురూ చేశారు. ఏపీలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం.. ఇదివరకే త్యాగం చేసిన జనసేన ఓ వైపు ఉండడంతో ఈ సీటు కోసం ఫైట్ నెలకొంది. బీజేపీ ఈ సీటును తనకే కావాలని భీష్మించుకు కూర్చుంది. దీంతో ఈ సీటు వ్యవహారం ఎటూ తేలడం లేదు.
బీజేపీ ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నిక ప్రచారాన్ని చాలా రోజుల ముందే ప్రారంభించింది. బీజేపీ ఏపీ శాఖ సహ ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్ స్వయంగా మకాం వేశారు. బీజేపీ అనుబంధ సంఘాల నేతలు, చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశం అవుతున్నారు. పార్టీ రాష్ట్ర యంత్రాంగం మొత్తం తిరుపతి ఎన్నికపైనే ఉంది.
ఇక ఏపీలో బీజేపీ కంటే బలంగా ఉన్న పార్టీ జనసేన. తిరుపతిలో పవన్ , చిరంజీవికి అభిమానులు, జనసేనకు కార్యకర్తల బలం ఉంది. బీజేపీకి అవకాశాలు ఇస్తే జనసేన ఏపీలో ఉండదని వారంతా ఇప్పటికే పవన్ కు స్పష్టం చేశారు. ఈసారి ఏపీలో పోటీచేసి తీరాలని పట్టుబడుతున్నారు.లేదంటే క్యాడర్ చెదిరిపోతుందంటున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కంటే అధిక ఓట్లను జనసేన గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రత్యేకంగా తన టీంతో పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. పవన్ ను తిరుపతి ఎంపీ సీటు కోసం ఒప్పించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. కానీ పోటీకి ఇద్దరూ పట్టుబట్టడంతో ఈ చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఏ పార్టీ పోటీచేయాలనే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం మీదే వదిలేద్దామని సోమువీర్రాజు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎవరూ పోటీచేసినా ఉమ్మడిగా ప్రచారం చేద్దామని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.