Begin typing your search above and press return to search.

టికెట్ తేలకుండానే బీజేపీ-జనసేన ప్రచారహోరు

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:30 PM GMT
టికెట్ తేలకుండానే బీజేపీ-జనసేన ప్రచారహోరు
X
తిరుపతి ఉప ఎన్నిక వేడి ఏపీలో రాజుకుంది. బీజేపీ-జనసేన ఏపీలో పొత్తులో ఉన్నాయి. అది తేలకుండానే ఇప్పుడు ఎవరికి వారు ప్రచార పర్వలోకి దూకడం రెండు పార్టీల శ్రేణులను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి.

నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను ఓదార్చుతానంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభించేశాడు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు.అయితే పవన్ వ్యూహం నివర్ తుఫాన్ బాధితులే కాకుండా తిరుపతి ఉప ఎన్నికపైనే జరుగుతోందని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

ప్రధానంగా పవన్ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. రైతులకు సాయం చేయనందుకు తాజాగా ఇంట్లోనే దీక్ష చేపట్టారు. జోరు వర్షంలోనూ తిరుపతిలో పర్యటించి కాకపుట్టించారు. పవన్ తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలా సడెన్ గా బయటకు వచ్చాడని అంటున్నారు.

ఇక బీజేపీ కూడా నివర్ తుఫాన్ పై ఆందోళనలు చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం చిత్తూరు జిల్లాలో రోడ్లపై జగన్ ఒకసారి నడవాలంటూ సవాల్ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి సైతం తిరుపతిలో ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో బీజేపీ సైతం సొంతంగా తిరుపతిలో ప్రచారం చేస్తున్నట్టే కనిపిస్తోంది.

అయితే ఉమ్మడిగానే తిరుపతిలో పోటీచేసేందుకు జనసేన, బీజేపీలు గతంలో నిర్ణయించారు. టికెట్ విషయంలో ఇంకా ఎవరికనేది తేలలేదు. కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే ఒక కమిటీ కూడా వేసింది. తిరుపతి టికెట్ తమకే కావాలని పవన్ పట్టుదలతో ఉన్నాడు. బీజేపీ కూడా జీహెచ్ఎంసీ, దుబ్బాక ఊపుతో విడిచే పరిస్థితి లేదు. దీంతో టికెట్ తేలకుండానే జనసేన, బీజేపీలు సొంతంగా ప్రచార పర్వంలోకి దూకడం హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే పొత్తు పొడిచేలా కనిపించడం లేదని తెలుస్తోంది.