Begin typing your search above and press return to search.
ఈవీఎం హ్యాకింగ్.. చిక్కుల్లో కిషన్ రెడ్డి
By: Tupaki Desk | 23 Jan 2019 3:52 PM GMTఊహించని విధంగా విపరీత చిక్కుల్లో చిక్కుకున్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఈవీఎం హ్యాకింగ్ వివాదానికి సంబంధించి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు సయ్యద్ సూజా అనే వ్యక్తి. తనకుతాను సైబర్ నిపుణుడిగా చెప్పుకునే ఈ వ్యక్తి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. 2014 ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు హ్యాక్ అయ్యాయని - అందువల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని సయ్యద్ ఆరోపించారు. ఈ హ్యాకింగ్ కు సంబంధించి కిషన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసంటున్నాడు సయ్యద్.
ఈవీఎం డిజైనింగ్ - తయారీకి సంబంధించిన టీమ్ లో సయ్యద్ ఓ సభ్యుడు. ఈసీఐఎల్ లో ఈ ఈవీఎంలు తయారయ్యాయి. ప్రకాష్ - కేశవ్ - వంశీ - అంజాస్ తో కలిసి తను కూడా ఈవీఎం డిజైనింగ్ - మేకింగ్ లో పాలుపంచుకున్నానని తెలిపిన సయ్యద్.. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో తన టీమ్ సభ్యులు హత్యకు గురవ్వడంతో భయపడి తను అమెరికాకు పారిపోయానని వెల్లడించాడు. లండన్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఈ విషయాలు బయటపెట్టాడు సయ్యద్.
పోలింగ్ ముగిసిన తర్వాత - ఫలితాల వెల్లడికి కొన్ని రోజుల ముందు తన టీమ్ సభ్యుల్ని కిషన్ రెడ్డి చంపించారని సయ్యద్ ఆరోపిస్తున్నాడు. గన్ మెన్స్ కు చెప్పి తన టీమ్ సభ్యుల్ని కిషన్ రెడ్డి కాల్చిచంపించారనేది సయ్యద్ ఆరోపణ.
ఈ ఆరోపణల్ని కిషన్ రెడ్డి ఖండించారు. సయ్యద్ ఆరోపణల్లో నిజం లేదంటున్న కిషన్ రెడ్డి.. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. నిజంగా తను హ్యాకింగ్ కు పాల్పడినట్టయితే - తెలంగాణ ముఖ్యమంత్రిని అయ్యేవాడినని అన్నారు.