Begin typing your search above and press return to search.

పవన్ తో భేటీ అయిన బీజేపీ యువ ఎంపీలు ...కారణం ఇదే ?

By:  Tupaki Desk   |   6 Jan 2020 6:33 AM GMT
పవన్ తో భేటీ అయిన బీజేపీ యువ ఎంపీలు ...కారణం ఇదే ?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు టాలీవుడ్ స్టార్ హీరో . ఒక సినీ నటుడిగా పవన్ కి కోటానుకోట్ల అభిమానులున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి దాదాపు అన్ని రంగాల్లోనూ అనేక మంది అభిమానులున్నారు. ఆయనను రాజకీయ నాయకుడిగా కంటే సినీ హీరోగానే అభిమానించేవారు ఎక్కువ. రాజకీయ నేతల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే గాక, ఇతర రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్‌ ను ఆరాధించేవారు చాలామంది ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్‌తో యువ రాజకీయ నేతలు దిగిన ఫొటోనే ఇందుకు నిదర్శనం గా చెప్పవచ్చు. జనసేనాని తో బీజేపీ కి చెందిన ఇద్దరు యువ ఎంపీలు ఆదివారం కలిశారు.

కర్ణాటక కు చెందిన యువ ఎంపీలతో పవన్ భేటీ అయ్యారు. బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహాను పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ పర్యటనలో పవన్‌ తోపాటు జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఎంపీ ప్రతాప్ సింహా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా.. పవన్ కళ్యాణ్‌తో కలిసిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నేను ఆయన సినిమాలను చూసేవాణ్ని. కాలేజీ రోజుల్లో ఆయన్నెంతగానో అభిమానించేవాణ్ని. ఈ రోజు నేను, తేజస్వి సూర్య కలిసి అయన ని కలిసి మాట్లాడే అవకాశం లభించింది. థాంక్యూ పవన్ కళ్యాణ్ సర్, విశ్వ గారూ'అని ప్రతాప్ సింహా ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాన్ నటించిన కొన్ని సినిమాలు కన్నడ లోకూడా విడుదలైయ్యాయి. దీంతో పవన్ కు కన్నడ తోనూ మంచి ఫ్యా్న్ ఫాలోయింగ్ ఉంది.

ఇకపోతే ఈ భేటీ పై కొందరు మాత్రం మరో విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మద్యే పవన్ బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మోడీ, అమిత్ షాలంటే తనకు అభిమానమని అన్నారు. దేశంలో ఎప్పట్నుంచో ఉన్న సమస్యలకు వారు పరిష్కారం చూపుతున్నారని వారిపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఏపీ రాజధాని వ్యవహారం పై మోడీ తో మాట్లాడతా అని కూడా పవన్ ఇటీవలే చెప్పాడు. దీనితో గత కొన్ని రోజులుగా పవన్ బీజేపీ కి దగ్గర అవుతున్నాడా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను బీజేపీ యువ ఎంపీలు కలవడం తో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.