Begin typing your search above and press return to search.

కొన్ని బీసీ ఓట్ల కోసం.. బీజేపీ ల‌క్ష్మ‌ణ రేఖ అందుకేనా?

By:  Tupaki Desk   |   31 May 2022 9:30 AM GMT
కొన్ని బీసీ ఓట్ల కోసం.. బీజేపీ ల‌క్ష్మ‌ణ రేఖ అందుకేనా?
X
మున్నూరు కాపుల ఓట్ల కోసం బీజేపీ గేలం వేసింది. ఈ క్ర‌మంలో భాగంగానే ల‌క్ష్మ‌ణ్ కు రాజ్య‌స‌భ టికెట్ ఇచ్చింది. దీంతో తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. చాలా మంది ఆర్ఎస్ఎస్ నేప‌థ్యం ఉన్న బీజేపీ నాయ‌కుల‌కు ద‌క్క‌ని వ‌రం లక్ష్మ‌ణ్ కు ద‌క్క‌డంతో సంబంధిత శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.

యూపీ కోటాలో ఇవాళ ఆయ‌న ల‌క్నో నుంచి నామినేష‌న్ వేయ‌నున్నారు. ఇదంతా బాగుంది ఈ ఎంపిక బీజేపీ ముందే చేసి ఉంటే బాగుండు క‌దా ! తెలంగాణ రాష్ట్ర స‌మితి అన‌స‌వ‌రంగా పార్థ సార‌థి లాంటి రెడ్డి నాయ‌కుల‌కు టికెట్టు ఇచ్చి, అస‌లు అవ‌కాశాన్ని చేజార్జుకుందే అన్న వాద‌న కూడా ఉంది.

తెలంగాణ వాకిట బీజేపీ బ‌లోపేతం అయ్యేందుకు బండి సంజ‌య్ లాంటి వారి కృషి ఫ‌లితం ఇచ్చినా ఇవ్వ‌కున్నా, ల‌క్ష్మ‌ణ్ లాంటి వారి ఎంపిక మాత్రం ఓ అత్య‌వ‌స‌ర ప‌రిణామ‌మే! ఎందుకంటే ఎప్ప‌టి నుంచో పార్టీని న‌మ్ముకున్న వారికి అధినాయ‌క‌త్వం అన్యాయం చేయ‌దు అనేందుకు ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ ఆయ‌న ఎంపిక.

ఇదే స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌కు క‌ర్ణాట‌క నుంచి నిర్మలా సీతారామన్ ఎంపిక మాత్రం బాలేద‌ని, ఆమెను ఎందుకు ఆ పద‌విలో అదే ప‌నిగా కంటిన్యూ చేస్తున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని సోష‌ల్ మీడియా రాత‌లు నిర‌సిస్తున్నాయి.

మ‌రోవైపు కాంగ్రెస్ నుంచి కూడా సీనియ‌ర్లకు అవ‌కాశాలు బాగానే ఉన్నా పార్టీని న‌మ్ముకున్న చాలా మందికి అన్యాయ‌మే జ‌రిగింద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ కాస్త బెట‌ర్ అన్న మాట కూడా వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ ఎంపిక‌కు ఇచ్చిన ప్రాధాన్యం బాగుంది.

ఇది తెలంగాణ వాకిట మంచి ప‌రిణామ‌మే! ఇప్ప‌టిదాకా పార్టీని న‌మ్ముకుని ఉన్న ఎవ్వ‌రికీ అన్యాయం చేయ‌లేదు అనేందుకు ద‌త్తాత్రేయ‌, విద్యాసాగ‌ర్, కిష‌న్ రెడ్డి లాంటి వారి జీవితాలే ఉదాహ‌ర‌ణ. ఈ కోవ‌లో ల‌క్ష్మ‌ణ్ కూడా చేరిపోయారు. మ‌రి! ఆయ‌న ఏ విధంగా రేప‌టి వేళ తెలంగాణ త‌రఫున అదేవిధంగా యూపీ త‌ర‌ఫున గొంతుక వినిపించి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయ‌నున్నారో అన్న‌ది వేచి చూడాలిక‌.