Begin typing your search above and press return to search.

యూపీ కోసం వ్యూహాన్ని మొదలుపెట్టిన బీజేపీ..

By:  Tupaki Desk   |   19 Nov 2021 6:34 AM GMT
యూపీ కోసం వ్యూహాన్ని మొదలుపెట్టిన బీజేపీ..
X
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఏడాదిలో జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటి నుంచే వ్యూహ, ప్రతి వ్యూహాలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆయా ప్రాంతాలకు ప్రతినిధులనునియమించింది. ఇందులో ఎక్కువగా సినియర్ నాయకులనే నియమించింది.

దీంతో ఇక్కడ మరోసారి బిజేపీ వచ్చేలా పెద్ద ప్రణాళికే రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా మోదీ కేంద్ర వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గారు. అంతేకాకుండా రైతులకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వ్యూహమే ఇదంతా అని కొందరు చర్చించుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా ఇన్ చార్జులను నియమించారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బూత్ ల వారిగా అధ్యక్షులను నియమించి వాటి బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. వీరిలో ముఖ్య నాయకులను నియమించడం విశేషం.

రాష్ట్రంలోని బిజ్, పశ్చిమ ప్రాంతాలకు కేంద్ర మంత్రి అమిత్ షా ను ఇన్ చార్జిగా నియమించారు. అలాగే కాశీ, అవధ్ ప్రాంతాలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే కాన్ఫూర్, గోరఖ్ పూర్ ప్రాంతాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారు.

యూపీని చేజిక్కించుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్ర పర్యటనలో 300 ప్లస్ మంత్రాన్ని అందించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మాత్రమే విజయం సాధించి కేంద్రంలో మారోసారి పాగా వేయనుందని అన్నారు. ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్నే నిర్ణయాలపై ప్రజలు హర్షిస్తున్నారని మరోసారి బీజేపీకే పట్టం కట్టాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఇక తాజాగా ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గారు. మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రెండేళ్లుగా పంజాబ్, హరియానా, ఉత్తరప్రదేశ్ రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గకుండా భీష్మించుకు కూర్చుంది.

అయితే తాజాగా ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో యూపీ ఎన్నికల వ్యూహంలో భాగమేనా..? అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్ రైతులు కూడా ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం పడకుండా ఆ చట్టాలను రద్దు చేశారని అంటున్నారు.