Begin typing your search above and press return to search.
ఆ ప్రముఖ నటుడి అరెస్ట్.. బెయిల్ పై రిలీజ్!
By: Tupaki Desk | 16 Jan 2018 10:26 AM GMTకేరళలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పన్ను ఎగ్గొట్టారన్న పేరుతో మలయాళ ప్రముఖ నటుడు..రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే బెయిల్ మీద విడుదల చేసిన వైనం సంచలనంగా మారింది. కేరళకు చెందిన సురేశ్ గోపీ కాసుల కక్కుర్తి కోసం తాను ఉండే ప్రాంతానికి విరుద్ధంగా పుదుచ్చేరిలో ఉంటున్నట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి కారును కొనుగోలు చేశారు.
ఈ కక్కుర్తి కారణంగా రూ.30లక్షల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లుగా భావిస్తున్నారు. కారు అక్రమ రిజిస్ట్రేషన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. స్పందించిన తిరువనంతపురం కోర్టు సురేశ్ గోపీకి బెయిల్ తో కూడిన అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.
ఆ మధ్య జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫు స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేసిన సురేశ్ గోపీని.. కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు. అనంతరం రూ.లక్ష బాండ్లతో ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ మీద విడుదల చేశారు. సురేశ్ గోపీ అరెస్ట్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా చెబుతుననారు. ఏమైనా తప్పుడు పనుల కారణంగా లేనిపోని తలనొప్పుల్ని ప్రముఖులు నెత్తిన వేసుకుంటారనటానికి సురేశ్ గోపీ తీరు ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు. పన్ను ఎగ్గొట్టటం ద్వారా రూ.30లక్షలు మిగిల్చి ఉండొచ్చు. కానీ.. ఆంతకు వందల రెట్లు పరువు ప్రతిష్ఠలు మంట కలిసింది మర్చిపోకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.