Begin typing your search above and press return to search.

అనూహ్యం.. తెలంగాణలో బీజేపీ ఆధిక్యత

By:  Tupaki Desk   |   23 May 2019 5:16 AM GMT
అనూహ్యం.. తెలంగాణలో బీజేపీ ఆధిక్యత
X
తెలంగాణలో కారు.. సర్కారు.. పదహారు అని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో మెజార్టీ సీట్లు ఇచ్చిన టీఆర్ఎస్ ను గద్దెనెక్కించిన తెలంగాణ ప్రజలు.. పార్లమెంట్ నియోజకవర్గాల వరకు వచ్చేసరికి జాతీయ కోణంలోనే చూశారని అర్థమవుతోంది. అందుకే తెలంగాణలో కుదేలైన కాంగ్రెస్ ను కాదని.. జాతీయ పార్టీ బీజేపీ వైపు తెలంగాణలో మొగ్గు చూపారు.

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతింది. మొత్తం 118 నియోజకవర్గాల్లో పోటీచేస్తే 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కేవలం గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే బీజేపీ నుంచి గెలిచారు.

ఇక తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లలో తొలి రౌండ్ లో ఆధిక్యత కనబరచడం సంచలనంగా మారింది. అస్సలు సోదిలోనే ఉండదనుకున్న బీజేపీ ఏకంగా నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవితపై తొలిరౌండ్ లో ఆధిక్యత చూపడం.. కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 14 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండడం విశేషం. ఇక ఆదిలాబాద్, సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థులు తొలి రౌండ్ ఆధిక్యత సాధించడం విశేషంగా చెప్పవచ్చు

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని అర్తమవుతోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల వేల ప్రజలు టీఆర్ఎస్ కంటేకూడా జాతీయ కోణంలోనే చూసి ఓటేశారని అర్థమవుతోంది. దీన్ని బట్టి టీఆర్ఎస్ కు తెలంగాణలో ప్రతిపక్షంగా బీజేపీ ఎదుగుతుందని అర్థం చేసుకోవచ్చు.